Begin typing your search above and press return to search.
యంగ్ టైగర్ ఫ్యాన్స్ లో ప్రశ్చాతాపం మొదలైందా?
By: Tupaki Desk | 18 Aug 2022 3:30 PM GMTపాన్ ఇండియా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` సక్సెస్ సంగతి పక్కనబెడితే? ఇందులో ఎన్టీఆర్ పోషించిన కొమరం భీమ్ పాత్రపై అభిమానులు ఎంతగా నిరుత్సాహానికి గురయ్యారో తెలిసిందే. ప్రతిగా టైగర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా సహా రాష్ర్ట వ్యాప్తంగా పెద్ద రచ్చే చేసారు. తొలి షో అనంతరం థియేటర్లు డోర్లు పగలగొట్టడం...స్ర్కీన్ లు చించేచేయడం..రాజమౌళిని దుర్భాషలాడటం వంటివి జరిగాయి.
ఇవన్నీ కేవలం రామ్ చరణ్ కి ధీటుగా తారక్ పాత్రని తీర్చి దిద్దలేదు అన్న కోపంతో జరిగిన ఘర్షణ. టైగర్ ఫ్యాన్స్ సహనాన్ని కోల్పోయి ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు. అటుపై తారక్ సైతం అసంతృప్తికి గురైనట్లు..అతని మనసు నొచ్చుకున్నట్లు తెరపైకి వచ్చింది. అయితే వీటిపై తారక్ గానీ...రాజమౌళి గాని అధికారికంగా ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
థియేటర్ రిలీజ్ అనంతరం ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చిన తర్వాత `ఆర్ ఆర్ ఆర్` గ్లోబల్ స్థాయిలో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. నెట్ ప్లిక్స్ స్ర్టీమింగ్ లో ట్రెండింగ్ లో నిలిచింది. హాలీవుడ్ మేకర్స్ మెచ్చిన చిత్రంగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇటీవల `ఆర్ ఆర్ ఆర్` కి..అందులో నటించిన తారక్ పాత్రకి ఏకంగా ఆస్కార్ అవార్డు సైతం వరిస్తుందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే.
కొమారం భీమ్ పాత్ర 2023 ఆస్కార్ కి నామినేట్ అవుతుందంటూ ప్రచారం ఠారెత్తిపోతుంది. ఉత్తమ నటుల జాబితాలో తారక్ పేరు ఉందని ప్రఖ్యాత మ్యాగజైన్లు సైతం రివీల్ చేస్తున్నాయి. ఇది జరుగుతుందా? లేదా? అన్నది పక్కనబెడితే! ఇది నిజంగా గర్వించదగ్గ విషయమే. ఇప్పటివరకూ ఏ తెలుగు నటుడి పేరు ఆస్కార్ రేసులో కనీసం వినిపించింది కూడా లేదు.
అలాంటిది తారక్ పేరు ఆస్కార్ నామినేషన్స్ లో ఉందంటూ తెరపైకి రావడం ఓ సంచలనం. మరి ఈ సమీకరణాల నేపథ్యంలో తారక్ అభిమానుల్లో ప్రశ్చాతాపం మొదలైందా? అంటే అవుననే వినిపిస్తుంది. ఆనాడు రాజౌళిని నిందించిన వారు నేడు మాస్టర్ ఫిల్మ్ మేకర్ ని గొప్పగా ఆకాశానికి ఎత్తేయడం మొదలు పెట్టారు. మరి అంతా కోరుకున్నట్లు టైగర్ కి ఆస్కార్ వరిస్తే ఇండియాకి పండగే.