Begin typing your search above and press return to search.
ప్రకటించిన తేదీకే థియేటర్లలోకి `రిపబ్లిక్`
By: Tupaki Desk | 16 Sep 2021 6:30 AM GMTమెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇటీవల బైక్ యాక్సిడెంట్ కి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్యం కుదుటపడుతోంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సాయితేజ్ నటించిన రిపబ్లిక్ చిత్రాన్ని రిలీజ్ చేయడం బాగోదని నిర్మాతలు వెనక్కి తగ్గే అవకాశం ఉందని ప్రచారం సాగింది. కానీ అలాంటి సన్నివేశం ఎక్కడా కనిపించేలేదని తాజా పరిస్థితుల్ని బట్టి తెలుస్తోంది. సాయి తేజ్ కథానాయకుడిగా దేవకట్టా దర్శకత్వంలో `రిపబ్లిక్` తెరకెక్కిన సంగతి తెలిసిందే. షూటింగ్ సహా అన్ని పనులు పూర్తి చేసుకున్న సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.
అక్టోబర్ 1న రిలీజ్ చేయాలని డేట్ కూడా ఫిక్స్ చేసారు. కానీ ఇంతలో సాయి యాక్సిడెంట్ తో రిలీజ్ వాయిదా పడుతుందని భావించారు. కానీ రిపబ్లిక్ ని నిర్మాతలు అనుకున్నట్లుగానే అక్టోబర్ 1న రిలీజ్ చేస్తున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. జీటీవీ సంస్థ సినిమా హక్కులన్ని చేజిక్కించుకుంది. మార్కెట్ సహా అన్ని రకాల రైట్స్ అదే సంస్థకు నిర్మాతలు కట్టబెట్టారు. కాబట్టి రిలీజ్ విషయంలో వెనుకడుగు వేసేది లేదని సదరు సంస్థ ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సాయి తేజ్ మినహా అంతా ప్రచారంలో పాల్గొంటున్నారు. అందువల్ల వాయిదా లేదని తెలుస్తోంది. ఈ సినిమాని నిర్మాతలే నేరుగా రిలీజ్ చేయడం అంటే వెనక్కి తగ్గేవారు.
జీ-సంస్థ రిలీజ్ కాబట్టి కార్పోరేట్ నిబంధంనల ప్రకారం రిలీజ్ చేయాల్సిందే తప్ప ఇతర కారణాలతో వాయిదా పడటానికి వీలుండదు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 1న థియేటర్లో రిలీజ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా రిలీజ్ కు చాలా కారణాలే వినిపిస్తున్నాయి. ఇక నుంచి వరుసగా స్టార్ హీరోల సినిమాలు కూడా క్యూ కడతాయి. సెకెండ్ వేవ్ దాదాపు అదుపులోకి వచ్చిన నేపథ్యం..థర్డ్ వేవ్ ఇంకా ప్రారంభం కాకపోవడం వంటి సన్నివేశాల కారణంగా అగ్ర హీరోలు కూడా రిలీజ్ కు రెడీ అవుతున్నారు. వాళ్లొచ్చిస్తే మీడియం హీరోలకు చోటు దొరకదు. ఆ కారణంగానూ `రిపబ్లిక్` ముందస్తు రిలీజ్ కు వస్తున్నట్లు భావించవచ్చు. `రిపబ్లిక్` ని భగవాన్ పుల్లారావు నిర్మించిన సంగతి తెలిసిందే.