Begin typing your search above and press return to search.

#రీరిలీజ్.. క్రాక్ త‌ర్వాత వ‌కీల్ సాబ్ కూడా

By:  Tupaki Desk   |   14 Jun 2021 4:40 AM GMT
#రీరిలీజ్.. క్రాక్ త‌ర్వాత వ‌కీల్ సాబ్ కూడా
X
థియేట‌ర్ల‌కు సంధికాలం తొల‌గిపోయి మంచి రోజులు రానున్నాయ‌న్న సంకేతం అందుతోంది. గ‌త ఏడాదిలానే 50 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్ల‌ను ర‌న్ చేసుకునేందుకు ఆస్కారం ఉంది. అయితే ఇరు తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్లు నింపేందుకు ఫీడ్ ఎక్క‌డిది? పైగా క‌రోనా మ‌హ‌మ్మారీ అనంత‌రం ర‌క‌ర‌కాల‌ సందిగ్ధ‌త‌ల త‌ర్వాత జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించాలంటే ఆ రేంజులో ఛ‌రిష్మా ఉన్న హీరోలు ఎవ‌రున్నారు? అంటే..

చివ‌రికి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన వ‌కీల్ సాబ్ నే రీరిలీజ్ చేయాల‌ని ఆలోచిస్తున్నార‌ట నిర్మాత దిల్ రాజు. ఇంత‌కుముందు క‌ట్ చేసిన కొన్ని సీన్ల‌ను యాడ్ చేసి అడిష‌న‌ల్ ఫ్లేవ‌ర్ తో వ‌కీల్ సాబ్ ని రీరిలీజ్ చేస్తే జ‌నం థియ‌ట‌ర్ల‌కు వ‌స్తార‌ని ఆయ‌న నమ్ముతున్నార‌ట‌. వ‌కీల్ సాబ్ క‌లెక్ష‌న్లు పీక్స్ లో ఉండ‌గానే బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తో ర‌న్ అవుతున్నా సెకండ్ వేవ్ దూకుడుకు జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డానికి జంకారు. అందుకే ఇప్పుడు క్రైసిస్ త‌గ్గుముఖం ప‌ట్టాక తిరిగి థియేట‌ర్ల‌లో చూసేందుకు జ‌నం వ‌స్తార‌నే అంచ‌నా వేస్తున్నార‌ట‌.

ఇప్ప‌టికే ఖాళీగా ఉన్న థియేట‌ర్ల‌లోకి ర‌వితేజ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ క్రాక్ ని రీరిలీజ్ చేయ‌నున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. అలాగే వ‌కీల్ సాబ్ కూడా రీరిలీజ్ కి రానుంది. అయితే ఇప్ప‌టికే ఈ రెండు సినిమాల్ని ఓటీటీల్లో మెజారిటీ ప్ర‌జ‌లు చూసేశారు. అలా చూడ‌లేని జ‌నం థియేట‌ర్ల‌కు వ‌చ్చే వీలుంది. పైగా ప‌వ‌న్ ని పెద్ద తెర‌పై చూస్తే వ‌చ్చే మ‌జా కోసం అభిమానులు తిరిగి థియేట‌ర్ల‌కు వ‌స్తార‌ని అంచ‌నా వేస్తున్నారు.

అవ‌తార్ 3డిని ప‌ది సార్లు రీరిలీజ్ చేసినా జ‌నం థియేట‌ర్ల‌కు వెళ్లి పండోరా గ్ర‌హంపై విహ‌రించి వ‌చ్చారు. అవ‌తార్ 100 రోజులు ఆడిన త‌ర్వాత రెండో సారి మూడోసారి చూసిన‌వారున్నారు. హాలీవుడ్ మూవీతో పోలిక కాదు కానీ.. ప‌వ‌న్ కి ఉన్న క్రేజును త‌క్కువ అంచ‌నా వేయ‌లేం అని విశ్లేషిస్తున్నారు.