Begin typing your search above and press return to search.

యాక్టర్స్ ని గౌరవించండి: 'డీజే టిల్లు' హీరో విజ్ఞప్తి..!

By:  Tupaki Desk   |   4 Feb 2022 7:31 AM GMT
యాక్టర్స్ ని గౌరవించండి: డీజే టిల్లు హీరో విజ్ఞప్తి..!
X
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కేవలం నటుడుగానే కాకుండా స్క్రీన్ రైటర్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. 'గుంటూరు టాకీస్' 'కృష్ణ అండ్ హిజ్ లీల' వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన సిద్ధు.. ఇప్పుడు ''డీజే టిల్లు'' అనే యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో వస్తున్నారు. విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నేహశెట్టి హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మించారు. త్వరలోనే థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా హీరోని ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నపై అభ్యంతరాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.

''డీజే టిల్లు'' ట్రైలర్ లో 'నీ ఒంటిపై ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయి?' అని హీరోయిన్ ని హీరో అడిగే సీన్ ని గుర్తు చేస్తూ ''హీరోయిన్ చేత 16 పుట్టుమచ్చలు ఉన్నాయని చెప్పించారు కదా.. హీరోయిన్ కు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో రియల్ గా తెలుసుకున్నారా?'' అని హీరో సిద్ధు జొన్నలగడ్డని ఓ విలేఖరి ప్రశ్నించారు. అయితే దీనికి కాస్త ఇబ్బంది పడిన సిద్దు స్పందిస్తూ.. ఈ ప్రశ్నకు తాను అవయిడ్ చేస్తున్నట్లు సమాధానమిచ్చారు. అలాంటి వల్గర్ ప్రశ్న అడిగినప్పుడు దానిపై అభ్యంతరం చెప్పకుండా సైలెంట్ గా ఉండటంపై హీరోని నెటిజన్లు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తాజాగా సిద్ధు జొన్నలగడ్డ సోషల్ మీడియాలో ఓ నోట్ రిలీజ్ చేసారు.

''నన్ను తీవ్రంగా బాధించిన విషయాన్ని దీని ద్వారా పరిష్కరించాలనుకుంటున్నాను. నా కొత్త చిత్రం Dj Tillu థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా చాలా కించపరిచే ప్రశ్న (అనుకోకుండా నేను నమ్మాలనుకుంటున్నాను) నన్ను అడిగారు. నేను అలా స్పందించడానికి కారణం ఏమిటని చాలా మంది నన్ను అడిగారు. నేను చాలా ప్రశాంతంగా మరియు కంపోజ్డ్ పద్ధతిలో ఆ ప్రశ్నను తిరస్కరించాలనే మార్గాన్ని ఎంచుకున్నాను. నేను టెంపర్ ని ప్రదర్శించకుండా నిగ్రహంగా ఉండాలని అనుకున్నాయి. నేను దానికి సమాధానం చెప్పి ఆ ప్రశ్నను గౌరవించాలని అనుకోలేదు'' అని సిద్దు వివరించారు.

''నటీనటుల పట్ల కొంతమందికి ఉన్న అభిప్రాయాన్ని కూడా అది తెలియజేస్తుంది. నటీనటులు ఇంటిమేట్ సీన్స్ చిత్రీకరించేటప్పుడు చాలా కష్టపడతారు. నిజానికి చాలా ఎక్కువ కష్టపడతారు. ముఖ్యంగా మహిళలలు సెట్‌ లో దాదాపు వంద మంది వ్యక్తుల మధ్య తమ సహనటుడిని ముద్దు పుట్టుకునే సన్నివేశాల్లో నటిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఒక టెక్నిషియన్ వారి ముఖం వద్ద లైట్ పట్టుకుని ఉన్నప్పుడు నటించడానికి చాలా ధైర్యం కావాలి. నటీనటులందరి తరపున స్వేచ్ఛ తీసుకుని ఇది చెప్తున్నాను - అంత ధైర్యం ఉన్నందుకు మేము గౌరవించబడతాము. మేము కథలు చెబుతాము, వినోదాన్ని అందిస్తాము. మేము చేసే పనిని బట్టి మా నిజ జీవితాలని జడ్జ్ చేయబడతాయని మేం ఎక్సపెక్ట్ చేయం''

''ఇక్కడితో దీన్ని వదిలేయాలని ప్రతి ఒక్కరినీ నేను హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే నా సినిమాని కంటెంట్ కోసం, నవ్వుల కోసం.. ట్రైలర్ సృష్టించిన మ్యాడ్ నెస్ కోసం ప్రచారం చేయాలనుకుంటున్నాను. మిమ్మల్ని అలరించేందుకు, నవ్వించడానికి, ఏడిపించడానికి.. భావోద్వేగాల రోలర్ కోస్టర్‌ లో మిమ్మల్ని తీసుకెళ్లడానికి 'DJ టిల్లు' త్వరలో మీకు సమీపంలోని థియేటర్‌ లో రాబోతోంది. త్వరలో కలుద్దాం!'' అని సిద్దు నోట్ లో పేరొన్నారు. దీనికి యాక్టర్స్ ని గౌరవించమని వినయపూర్వకమైన విజ్ఞప్తి చేస్తున్నానని హ్యాష్ ట్యాగ్ ని జోడించారు. దీనికి నెటిజన్ల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.