Begin typing your search above and press return to search.

చిరు లుక్‌ పై మెగా రెస్పాన్స్ అదుర్స్‌

By:  Tupaki Desk   |   29 Oct 2016 11:31 AM GMT
చిరు లుక్‌ పై మెగా రెస్పాన్స్ అదుర్స్‌
X
మెగా స్టార్ చిరంజీవి స‌న్సేష‌న‌ల్ మూవీ ఖైదీ నెం.150 ఫ‌స్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ లుక్‌లో చిరు అదిరిపోయే గెట‌ప్‌లో మెగా ఫ్యాన్స్‌ని మెస్మ‌రైజ్ చేసేశాడు. పోస్ట‌ర్ రిలీజైన మిన‌ట్స్‌లోనే కుప్ప‌లు కుప్ప‌లుగా లైకులు పోగ‌యిపోవ‌డ‌మే కాకుండా షేరింగులు రికార్డు సృష్టిస్తున్నాయి. వీవీ, చిరు కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఈ మూవీ చిరు త‌న‌యుడు చెర్రీనే నిర్మిస్తున్నాడు. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రికార్డులు సృష్టిస్తోంది. సెట్స్ మీద‌కి వెళ్లిన ద‌గ్గ‌ర నుంచి హాట్ టాపిక్ అయింది. దీపావ‌ళికి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామ‌ని ముందే ప్ర‌క‌టించిన ఈ మూవీ టీం.. అనుకున్న‌ట్టే చిరు ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసింది.

ఇక‌, ఈ లుక్‌పై అంద‌రూ కామెంట్ల వ‌ర్షం కుమ్మ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే స‌న్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రామ్‌గోపాల్ వ‌ర్మ కూడా త‌న కామెంట్లు కుమ్మ‌రించారు. అయితే, ఎప్పుడూ ఆయ‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసే వ‌ర్మ త‌న స్టైల్‌ కి భిన్నంగా చిరుని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. . 'నేను ఏడేళ్ల క్రితం చూసిన చిరంజీవి కన్నా.. ఈ లుక్ లో చిరు వయసు ఏడేళ్లు తక్కువగా కనిపిస్తోంది' అంటూ కామెంట్ చేశాడు. ఇక‌, మెగా ఫ్యామిలీ హీరోలైతే.. చిరుని ఆకాశానికి ఎత్తేశారు.

బాస్ ఈజ్ బ్యాక్ అంటూ వ‌రుణ్ తేజ్‌ - చెర్రీలు త‌మ ఆనందాన్ని పంచుకున్నారు. బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ పేజ్ లో మెగా లుక్ ను పోస్ట్ చేశారు. సో.. చిరు 150 మూవీ ఫ‌స్ట్ లుక్కే అదిరిపోతుంటే.. మూవీ ఎంత దుమ్మురేపుతుందో చూడాలి. ఈ సినిమాను 2017 సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే టాకీ పార్ట్ పూర్తిగా అయిపోయిన‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాల క‌థ‌నం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/