Begin typing your search above and press return to search.

ఏమే ఒసే అంటే సూపర్ స్టారేనా ?

By:  Tupaki Desk   |   24 Dec 2015 3:30 PM GMT
ఏమే ఒసే అంటే సూపర్ స్టారేనా ?
X
ఆది - ఆదాశర్మ జంటగా నటించిన గరం ట్రైలర్ కి రెస్పాన్స్ బాగానే ఉంది. ఒకవైపు హీరో చేసిన మాస్ రచ్చకు పాజిటివ్ రియాక్షన్ తో పాటు.. డైలాగుల్లో మరీ శృతి మించారనే టాక్ కూడా వినిపిస్తోంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరో కేరక్టరైజేషన్ గురించే.

'ఈడియట్' లాంటి హీరో అని అర్ధమవుతున్నా.. ఇప్పటివరకూ అందర్నీ కామంతో చూశా.. దీనొక్కదాన్ని ప్రేమతో చూస్తాను అనడం మాత్రం టూమచ్ అనాల్సిందే. ఇక 'మళ్లీ ఇంకోసారి మెత్తగా తగిలితేనే బాడీలో హీట్ తగ్గుతుంది' అనడాన్ని ఏ యాంగిల్ నుంచి వినాలో, ఎలా జస్టిఫై చేసుకోవాలో అర్ధం కాని విషయం. హీరోయిన్ ని ఉద్దేశించి మాట్లాడే మాటలు కూడా మరీ హద్దు దాటిపోయినట్లు అనిపిస్తోంది. ఎంత ప్రేమతో అయితే మాత్రం.. పక్కనోళ్లతో మాట్లాడేటపుడు అది, ఇది అని ఈ రోజుల్లో ఎవరు మాట్లాడుతున్నారనేది అర్ధం కాదు.

'దాంతో ఏదన్నా ప్రాబ్లెం ఉంటే.. అది నా లైఫ్ లోకి రాకముందు చూసుకోవాల్సింది'అని అంటారు మన హీరో. ఇక హీరోయిన్ తో అయితే సచ్చేదాకా సవాలక్ష ప్రాబ్లెమ్స్ ఉంటాయే అంటున్నాడు. ఇలా ఏమే, ఒసే అనే మాటలు ఇదివరకు వినిపించేవేమో కానీ.. ఇవాల్టి రోజుల్లో ఇలా సంబోధిస్తే భార్యలు పోలీస్ కేసులు కూడా పెడతారు. ఇక పాటలనీ వదల్లేదు. అక్కడా అదే తంతు.. నీ నవ్వు బాగుందే, నడక బాగుందే అంటూ సేమ్ లాంగ్వేజ్. ఎంత మాస్ మూవీ అయితే.. మరీ ఇలా ఆడవాళ్లను అసభ్యంగా మాట్లాడేస్తే.. సూపర్ హీరోలు అయిపోతారా ? హీరోలు, డైరెక్టర్లు ఈ విషయం కాస్త ఆలోచిస్తే బెటర్.