Begin typing your search above and press return to search.

దేవి పాటపై ప్రశంసల వెల్లువ

By:  Tupaki Desk   |   20 Jan 2016 10:04 AM IST
దేవి పాటపై ప్రశంసల వెల్లువ
X
పితృవియోగంతో బాధపడుతున్నా కార్యదీక్షని నమ్ముకుని నాన్నకు ప్రేమతో సినిమాలో తనపనిని పూర్తిచేసిన దేవిశ్రీప్రసాద్ తనపై గౌరవాన్ని ఒక మెట్టు పెంచుకున్నాడు. నిజానికి సుక్కు - దేవిల మ్యాజికల్ మ్యూజిక్ ఈ సినిమాలో అంతకనిపించకపోయినా విమర్శకులు పెదవి విరువలేకపోవడానికి కూడా అదే కారణం.

అయితే రోలింగ్ టైటిల్స్ సమయంలో తన తండ్రికి, ప్రపంచంలో వున్న అందరి నాన్నలకు అంకితమిస్తూ కంపోజ్ చేసిన పాట మాత్రం అందరినీ ఆకట్టుకుంది. పండుగ సమయంలో విడుదల చేసిన వీడియో సాంగ్ అయితే అందరి కళ్ళు చమర్చేలా చేసింది.

ఈ పాటతో ప్రతీఒక్కరూ ప్రత్యేకంగా కనెక్ట్ అవుతున్నట్టు, తమతమ తండ్రుల స్మృతులను గుర్తుతెచ్చుకుంటున్నట్టు, దేవి కంపోజిషన్ లలో బెస్ట్ ఇదేనంటూ ట్విట్టర్ లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నాన్నకు ప్రేమతో అంటూ సాగిన ఈ పాటే సత్యమూర్తిగారికి నిజమైన నివాళి అంటూ కీర్తించడం విశేషం.