Begin typing your search above and press return to search.
రిటైర్డ్ పోలీస్ తో రానా సీక్రెట్ ఆపరేషన్
By: Tupaki Desk | 2 Jan 2020 4:03 AM GMT`నీదీ నాదీ ఒకే కథ` చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు వేణు ఊడుగుల. ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `విరాటపర్వం`. రానా కథా నాయకుడి గా నటిస్తున్న విషయం తెలిసిందే. సాయి పల్లవి నటనకు అవకాశమున్న పల్లెటూరి అమ్మాయిగా ఈ చిత్రంలో కనిపించనుంది. నందితా దాస్ జర్నలిస్టుగా నటిస్తున్నారు. ఉత్తర తెలంగాణ లో 90వ దశకం లో జరిగిన యదార్థ సంఘటనల నేపథ్యం లో రొమాంటిక్ డ్రామా గా ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర లో రానా నటిస్తున్నారు. అనారోగ్య కారణాల వల్ల ఇప్పటి వరకు ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొనని రానా డిసెంబర్ నుంచి షూటింగ్ లో పాల్గొంటున్నారు. సాయి పల్లవి పై ఇప్పటి వరకు పలు కీలక ఘట్టాలని చిత్రీకరించిన వేణు ఊడుగుల తాజాగా రానా పై షూటింగ్ చేస్తున్నారు. అయితే రానా తన పాత్ర కోసం ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి వద్ద ప్రత్యేకం గా శిక్షణ తీసుకుంటున్నారట. క్యారెక్టర్ అత్యంత సహజ సిద్ధంగా రావడం కోసం దర్శకుడు సూచించడంతో రానా ఈ ట్రైనింగ్ తీసుకుంటున్నాడని వినిపిస్తోంది.
సాయి పల్లవి పాత్ర గురించి కూడా మరో వార్త ప్రచారం లో వుంది. పల్లె ల్లో జానపద గీతాలు పాడుతూ ప్రజలను చైతన్య పరిచే యువతి గా ఆమె పాత్ర సాగుతుందని, చివరికి నక్సలైట్ గా మారిన అమ్మాయి గా ఆమె పాత్ర చిత్రణ వుంటుందని.. భువనగిరి లో అత్యంత దారుణ హత్య కు గురైన బెల్లి లలిత పాత్ర ని పోలి వుంటుందని తెలుస్తోంది.