Begin typing your search above and press return to search.
వర్మ ఈవెంట్ కు ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి
By: Tupaki Desk | 16 Jun 2022 12:30 PM GMTవివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన చిత్రం 'కొండా'. వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు అయిన కొండ మురళి మరియు సురేఖ ల జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ చిత్రం జూన్ 23వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. కొండా సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుండి వార్తల్లో నిలుస్తూనే ఉంది.
రాజకీయంగా ప్రాముఖ్యత కలిగిన కొండా మూవీ విడుదల నేపథ్యంలో హడావుడి కనిపిస్తుంది. కొండా మురళి నక్సలైట్ ఉద్యమం నుంచి రాజకీయాలకు అడుగులు వేయడం ఇంకా ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను కాస్త కల్పితం జోడించి 'కొండా' సినిమా ను తెరకెక్కించినట్లుగా వర్మ చెబుతున్నాడు. కొండా మురళి యొక్క చరిత్ర తనకు ఇన్సిపిరేషన్ గా అనిపించిందని వర్మ పేర్కొన్నాడు.
సినిమా ను వర్మ ప్రమోట్ చేసినట్లుగా మరెవ్వరు ప్రమోట్ చేయలేరు. ఎక్కడ ఏ విధంగా ఈవెంట్ ను నిర్వహిస్తే జనాలు వస్తారు.. జనాల దృష్టిలో సినిమా పడుతుంది అనేది ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆయన ఈ కొండా మూవీకి వరంగల్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశాడు. ఆ ఈవెంట్ కు పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఆహ్వానించాడు.. ఆయన వచ్చేందుకు ఓకే చెప్పాడు.
రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న కొండా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఖుష్ మహల్ గ్రౌండ్స్ మద్యకోట, ఖిలా(పోర్ట్) వరంగల్ లో ఈనెల 18న బ్రహ్మాండమైన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నట్లుగా ప్రకటించారు. రేవంత్ రెడ్డి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కాబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన టీజర్ లు మరియు ట్రైలర్ లు సినిమా పై అంచనాలు పెంచాయి. తాజాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా మరింత మంది దృష్టిని ఆకర్షించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా ను ఖచ్చితంగా వివాదాస్పద పాయింట్స్ ను టచ్ చేస్తూ కొందరికి అయినా కోపం వచ్చేలా తీసి ఉంటాడు. కనుక విడుదల అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూడాలి.