Begin typing your search above and press return to search.
స్టార్ హీరో పంచ్.. వెంటనే రివర్స్ పంచ్ పడింది!
By: Tupaki Desk | 2 April 2020 1:30 PM GMTఆయనో పెద్ద స్టార్ హీరో.. మంచి కామెడీ టైమింగ్ ఉన్న వ్యక్తి అని టాక్ ఉంది. అయితే పక్కన ఉన్న అందరిపైనా పంచులు వేస్తూ ఉంటాడట. మొన్న సంక్రాంతికి ఈ హీరో గారి సినిమా విడుదలైంది. మంచి కలెక్షన్లు వచ్చాయి గానీ విజేతగా మాత్రం నిలువలేదు. ఈ సినిమా రిలీజ్ అయిన కొత్తలో ఈ హీరో గారు తన సన్నిహితులకు.. పరిశ్రమలోని కొందరు ముఖ్యమైన వ్యక్తులకు సక్సెస్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి ఓ పాన్ ఇండియన్ సినిమాలో నెగిటివ్ రోల్ పోషించిన మరో హీరో కూడా హాజరయ్యాడు. అయితే మన హీరో గారికి పంచులు వేసే అలవాటు ఉంది కదా.. సరదా సరదాలో.. ఈ హీరోపై పంచు వేశాడట.
తన నెక్స్ట్ సినిమాలో ఓ చిన్న పాత్ర ఉంది చేస్తావా అని వెటకారంగా అడిగాడట. దాంతో ఆ హీరోకు చిర్రెత్తుకొచ్చింది.. ఆ హీరో ఏమి తక్కువ వాడు కాదు.. సూపర్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాడే.. ఇండస్ట్రీలో ఉన్న అందరి పుట్టుపూర్వోత్తరాలు తెలుసు.. లొసుగులు తెలుసు.. దీంతో వెంటనే "ఎందుకండీ ఈ పార్టీ? సంక్రాంతి విన్నర్ అని అవతలివాళ్ళు పోస్టర్ ఆల్రెడీ వేసుకున్నారు. మీ సినిమా కంటే ఆ సినిమాకే కలెక్షన్లు ఎక్కువని మా డిస్ట్రిబ్యూటర్లు చెప్తున్నారు" అంటూ తనదైన శైలిలో ఘాటుగా కౌంటర్ ఇచ్చాడట. ఈ బాబు ఒక్క టాలీవుడ్లోనే కాకుండా.. కోలీవుడ్.. బాలీవుడ్ అలా అన్ని వుడ్ లను కవర్ చేసిన వ్యక్తి. తనపై పంచులు వేస్తే ఊరుకుంటాడా? ఈ డైలాగ్ వేసేసి తాపీగా ఇంటికి వెళ్లిపోయాడట.
ఘాటు కౌంటర్ తో ఆ స్టార్ హీరో గారికి కోపం నషాళానికి అంటిందట. నిజానికి అప్పటికే సంక్రాంతి వార్ సమసిపోయిందట కానీ ఈ ఘాటు కౌంటర్ తో హీరో గారు సదరు సంక్రాంతి వార్ ను కలెక్షన్ లా పోరాటంగా మార్చిపారేశాడట. మొత్తానికి హీరోగారి పంచ్.. మరో హీరో గారి రివర్స్ పంచ్ సంక్రాంతి పోరాటానికి కారణం గా మారడం విచిత్రమైన విషయమే. నిజమే లెండి.. వాడెవడో చైనా గాడు గబ్బిలం మాంసం తింటే మనం లాక్ డౌన్లో ఇరుక్కున్నాం కదా.. డైరెక్టర్ సుకుమార్ అదేదో సినిమాలో చెప్పినట్టు.. ఇదంతా బటర్ ఫ్లై ఎఫెక్ట్ అని సరిపెట్టుకోవాలి.