Begin typing your search above and press return to search.

'క‌ళాపురం' ఎలా వుంది?

By:  Tupaki Desk   |   26 Aug 2022 11:30 AM GMT
క‌ళాపురం ఎలా వుంది?
X
శ్రీ‌కాకుళం యాస‌ని, అక్క‌డి క‌థ‌ల‌ని ప్ర‌ధాన ఇతివృత్తాలుగా తీసుకుని ద‌ర్శ‌కుడు క‌రుణ్ కుమార్ తెర‌కెక్కించిన మూవీ 'ప‌లాస 1978'. తొలి చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ఆయ‌న ఆ త‌రువాత అదే పంథాలో చేసిన మ‌రో మూవీ 'శ్రీ‌దేవి సోడా సెంట‌ర్‌'. ప‌వ‌రు హ‌త్య నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా కూడా ద‌ర్శ‌కుడికి మంచి పేరే తెచ్చిపెట్టింది. ఈ రెండూ సీరియ‌స్ క‌థ‌లే. అయితే ఈ సారి సీరియ‌స్ క‌థ‌ని ప‌క్క‌న పెట్టి కంప్లీట్ ఎంట‌ర్ టైన్ మెంట్ తో క‌రుణ్ కుమార్ తెర‌కెక్కించిన మూవీ 'క‌ళాపురం'.

స‌త్యం రాజేష్‌, సంచిత పూనాచ‌, కాశీమ ర‌ఫీ, చిత్రం శ్రీ‌ను, ప్ర‌వీణ్ యండ‌మూరి, జ‌నార్థ‌న్‌, కుమార్ త‌దిత‌రులు న‌టించారు. ట్రైల‌ర్ తోనే ప్రామిసింగ్ ఫిల్మ్ అనే భావ‌న‌ని క‌లిగించింది. సినిమా నేప‌థ్యంలో రూపొందిన 'కళాపురం' ఆగ‌స్టు 26న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ మూవీ ఎలా వుంది? .. ప‌బ్లిక్ టాక్ ఏంటీ అన్న‌ది ఇప్ప‌డు చూద్దాం. కుమార్ ( స‌త్యం రాజేష్‌) ద‌ర్శ‌కుడు అవ్వాల‌ని అవ‌కాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ వుంటాడు. అత‌ని స్నేహితుడు ప్ర‌వీణ్ (ప్ర‌వీణ్ యండ‌మూరి) హీరో కావాల‌ని చూస్తుంటాడు. కుమార్ కి ఇందు (కాశిమ ర‌ఫీ) అనే అమ్మాయితో మంచి అనుబంధం ఏర్ప‌డుతుంది.

ఇందు అవ‌కాశ వాది. కుమార్ కంటే ధ‌న‌వంతుడు ల‌భించ‌డంతో కుమార్ కు టాటా చెప్పేస్తుంది. దీన్ని అవ‌మానంగా భావించిన కుమార్ ఎలాగైనా ద‌ర్శ‌కుడిగా నిరూపించుకోవాల‌ని బ‌లంగా నిర్ణ‌యించుకుంటాడు. ఈ క్ర‌మంలో కుమార్ కు అప్పారావు ప‌రిచ‌యం అవుతాడు.

త‌న‌కు ప్రొడ్యూస‌ర్ కావాల‌నేది క‌ల‌. కుమార్ గురించి తెలుసుకున్న అప్పారావు నా సినిమాకు నువ్వే ద‌ర్శ‌కుడివి అంటూ అత‌ని చేతిలో అడ్వాన్స్ పెడ‌తాడు. ఇదే క్ర‌మంలో కుమార్ కు అప్పారావు ఓ కండీష‌న్ పెడ‌తాడు. సినిమాలో కొంత భాగాన్ని త‌న సొంత ఊరైన 'క‌ళాపురం'లో చేయాలంటాడు.

త‌న కండీష‌న్ కు అంగీక‌రించిన కుమార్ క‌ళాపురంలో ఏం చేశాడు? ఎలాంటి ప‌రిస్థితుల్ని ఎదుర్కొన్నాడు? ఫైన‌ల్ గా కుమార్ సినిమా తీశాడా? లేదా అన్న‌దే ఈ చిత్ర క‌థ‌. అయితే మొద‌టి సినిమా 'ప‌లాస‌'తో మంచి పేరు తెచ్చుకున్న క‌రుణ్ కుమార్ 'శ్రీ‌దేవి సోడా సెంట‌ర్‌'తో ఫ‌ర‌వాలేద‌నిపించాడు. కానీ 'క‌ళాపురం' ద‌గ్గ‌రికి వ‌చ్చేసరికి దొరికిపోయాడు. కార‌ణం ఇందులో స‌రైన క‌థ‌, క‌థ‌నాలు, అందుకు త‌గ్గ సీన్ లు లేక‌పోవ‌డ‌మే. స‌త్యం రాజేష్ మంచి టైమింగ్ వున్న న‌టుడు. అత‌ని టైమింగ్ స‌రిగా వాడుకోలేక‌పోయాడు.

సినీమా నేప‌థ్యంలో ఇప్ప‌టికే చాలా సినిమాలు రావ‌డంతో 'క‌ళాపురం' కాస్తా క‌ళ‌త‌ప్పి కొత్త‌గా అనిపించ‌లేదు స‌రిక‌దా బోరు కోట్టించింద‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి. క‌ళాకారుల క‌థ‌కు ప్రేమ‌క‌థ‌ని, రాజ‌కీయ ట్విస్ట్ ని జోడించి ద‌ర్శ‌కుడు క‌ల‌గూర గంప‌గా మార్చేశాడు. ఏ విష‌యంలోనూ స‌రైన స్ప‌ష్టత లేక‌పోవ‌డంతో క‌ళాపురం కాస్తా స‌గ‌టు ప్రేక్ష‌కుడికి క‌ళావిహీనంగా మారిపోయి తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది.