Begin typing your search above and press return to search.
రివ్యూలపై జరంత జాగ్రత్త తప్పదు
By: Tupaki Desk | 28 Sep 2017 1:25 AM GMTసినిమా రివ్యూలు.. ముఖ్యంగా ఆన్ లైన్ లో వస్తున్న రివ్యూలు.. సినిమాలపై కొంత ప్రభావం చూపేలాగే ఉంటున్నాయి. అలాగని రివ్యూలు బాగోలేకపోతే సినిమాకు కలెక్షన్స్ రాని పరిస్థితి ఏమీ ఉండదు. బాగున్న సినిమాకు రివ్యూలు హెల్ప్ అవుతాయి. రివ్యూలు బాగోకపోయినా.. స్టార్ హీరోల డెడికేటెడ్ అభిమాన గణాన్ని మెప్పిస్తే మూవీ పాస్ అయిపోతుంది. ఈ పాయింట్ ను కొందరు మిస్ అవుతుంటే.. మరికొందరు మాత్రం అదే విషయాన్ని జాగ్రత్తగా ఉపయోగించేసుకుంటున్నారు.
రీసెంట్ గా జై లవకుశ విషయంలో.. రివ్యూ రైటర్లను విమర్శించాడు ఎన్టీఆర్. అంతే కాదు.. ఓ కొత్త సినిమాను ఎమర్జెన్సీ వార్డ్ లో ఉన్న పేషెంట్ తో పోల్చేశాడు. అసలు ఎన్టీఆర్ స్థాయి ఉన్న హీరోకు ఇలాంటి కామెంట్స్ చేయాల్సిన అవసరమే లేదు. గతేడాది జనతా గ్యారేజ్ విషయంలో కూడా గొప్పగా ఏమీ రివ్యూలు రాలేదు. కానీ ఆ మూవీ ఇండస్ట్రీ రికార్డ్. ఆ విషయం ఇప్పడు ఎన్టీఆర్ కి గుర్తు లేదు. కారణం.. ఇప్పుడు మూవీ కలెక్షన్స్ డల్ అయిపోవడమే. అది జనాల చేతుల్లో ఉంటుంది.. కొండొకచో రిపీట్ ఆడియన్స్ అయిన ఫ్యామిలీలు.. వీరాభిమానుల చేతుల్లో ఉంటుంది. మళ్లీ మళ్లీ చూడాలని అనిపించేలా సినిమా లేకపోవడం అన్నది పాయింట్.
ఇదే సమయంలో ఆశ్చర్యకరంగా మహేష్ బాబు కూడా రివ్యూలపై రియాక్ట్ అయ్యాడు. సింపుల్ లాజిక్ అంటూ.. సినిమా బాగుంటే రివ్యూలు బాగుంటాయ్.. బాగోపోతే బాలేదని రాస్తారంతేగా అన్న సూపర్ స్టార్.. విమర్శకులు చేసే పనిలో తప్పేమీ లేదని సింపుల్ గా తేల్చేశాడు. నిజానికి మహేష్ బాబు సినిమా అయినంత మాత్రాన గొప్పగా రివ్యూలేమీ ఎవరూ ఇచ్చేయరు. ఇప్పుడు స్పైడర్ విషయంలో కూడా ఆన్ లైన్ లో అనేక రకాల రివ్యూలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి ముందు బ్రహ్మోత్సవం మూవీకి రివ్యూలే కాదు.. వసూళ్లు కూడా అంతకంటే దారుణంగానే వచ్చాయి. ఆగడు సంగతి చెప్పాల్సిన పనేమీ లేదు. అప్పుడు కూడా రివ్యూలపై మహేష్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు.
సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా నెగిటివ్ రివ్యూలపై రియాక్షన్ ఇవ్వలేదు. కాకపోతే.. ఈ మధ్య నా సినిమాలు మీరు సరిగ్గా చూడ్డం లేదు.. నాకూ కాసిని డబ్బులు కావాలి కదా.. అంటూ జనాలతోనే తన సినిమాపై జోక్ వేసుకున్నాడు పవన్ కళ్యాణ్. కంటెంట్ బాగుంటే.. రివ్యూల సంగతేమో.. లీక్ అయిపోయిన మూవీతో కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టచ్చనే విషయం ప్రూవ్ చేసిన పవర్.. పవర్ స్టార్ సొంతం.
మరిప్పుడు ఎన్టీఆర్ ఎందుకిలా అంటే.. ఇక్కడ తన సోదరుడు కళ్యాణ్ రామ్ కోసం తీసిన సినిమా కావడం.. తేడా వస్తే అదే మొత్తంలో తేడా ఉండడం.. పైగా టఫ్ కాంపిటీషన్ మధ్యలో రియాక్ట్ కావడాన్నే రీజన్ గా చెప్పుకుంటున్నారు సినిమా జనాలు. ఇన్నేసి కొత్త తరహా వాదనలు రావడానికి కారణం.. ఎన్టీఆర్ రియాక్ట్ కావడమే. అసలు స్పందించడమే మానేస్తే.. ఇలాంటి వాదనలు మొదలవు కదా.!