Begin typing your search above and press return to search.
టెస్ట్ సెంచరీ హీరోపై మనసు పారేసుకున్న `రేయ్` బ్యూటీ
By: Tupaki Desk | 27 Dec 2020 5:30 PM GMTప్రస్తుతం టీమిండియా ఆసీస్ తో టెస్ట్ సిరీస్ లో పరుగుల వేటలో ఉన్న సంగతి తెలిసిందే. యువ బ్యాట్స్ మన్ అజింక్య రహానె ఆస్ట్రేలియాపై ఘనమైన సెంచరీతో ప్రశంసలు అందుకున్నాడు. అతని స్నేహితురాలు కం అందాల కథానాయిక సయామి ఖేర్ ఆనందానికి అయితే అవధులే లేవ్. అతడిని పొగడ్తల్లో ముంచేసింది ఈ `రేయ్` (తెలుగు మూవీ) బ్యూటీ.
రెహానేని ఏకంగా సచిన్ టెండూల్కర్ ఇన్నింగ్స్ తో పోల్చేసింది ఈ బ్యూటీ. అజింక్య రహానె సెంచరీ ని హైలైట్ చేస్తూ ప్రశంసలు కురిపించింది. ఆదివారం మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో రెండో రోజు భారతదేశాన్ని స్ట్రాంగ్ పొజిషన్ లోకి తీసుకెళ్లడానికి అజింక్య రహానె గొప్ప ఆట ఆడారు. మిడిల్-ఆర్డర్ బ్యాట్స్ మన్ గా అజేయ సెంచరీ ని సాధించాడు.
ఇది గూగుల్ లో విపరీతంగా ట్రెండ్ అయ్యింది. ఇక చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. రెహానే ఇన్నింగ్స్ ను చూడటం ‘సంపూర్ణ ఆనందాన్నిచ్చిందని కొందరు ప్రశంసించారు.
పలువురు బాలీవుడ్ తారలు అజింక్య రహానెపై ప్రశంసల జల్లు కురిపించారు. సయామి ఖేర్ - నకుల్ మెహతా- సురేష్ మీనన్ -సంగీత స్వరకర్త శాంతను మొయిత్రా- నిర్మాత అతుల్ కాస్బెకర్ - స్క్రీన్ రైటర్ అనిరుద్ద గుహ- దర్శకుడు కరణ్ అన్షుమాన్ వీరిలో ఉన్నారు.
రెహానే ఇన్నింగ్స్ ని లెజండరీ బ్యాట్స్ మాన్ సచిన్ టెండూల్కర్ తో పోల్చిన సయామీ.. 1999 లో ఎంసిజిలో సెంచరీ చేసిన చివరి భారత కెప్టెన్ సచిన్ అని గుర్తు చేసింది.
ప్రస్తుతం టీమిండియా ఆటలో కమాండింగ్ స్థానంలో ఉంది. హనుమా విహారీ- రిషబ్ పంత్- రవీంద్ర జడేజాతో కీలకమైన భాగస్వామ్యంతో అజింక్య రహానె తన 12 వ టెస్ట్ సెంచరీ సాధించాడు. రెహానే 2 వ రోజు భారత్‌ను 277/5 వద్దకు చేర్చాడు. క్లిష్ట పరిస్థితుల్లో కీలకమైన 40 పరుగులు చేసిన జడేజాతో అతని అజేయ సెంచరీ స్టాండ్ నిర్ణయాత్మకమని తేలింది. ఎందుకంటే భారత్ ఇప్పుడు 82 పరుగుల ఆధిక్యంలో ఉంది.