Begin typing your search above and press return to search.
'RRR..KGF' కంటే గొప్ప చిత్రం `కార్తికేయ-2`! వర్మ
By: Tupaki Desk | 21 Aug 2022 8:23 AM GMTయంగ్ హీరో నిఖిల్ సిద్దార్ద్ నటించిన `కార్తికేయ 2` బాక్సాఫీస్ ని షేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈనెల 13 న రిలీజ్ అయిన సినిమా పాన్ ఇండియా వైడ్ రికార్డు వసూళ్ల దిశగా పయనిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లతో పాటు హిందీ బెల్ట్ లోనూ హౌస్ పుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. `కార్తికేయ` హిట్ నేపథ్యంలో ఏర్పడిన బజ్ ని నూరుశాతం సుసాధ్యం చేయడంలో సీక్వెల్ సక్సెస్ అయింది.
తెలుగు మార్కెట్ ని మించి హిందీ మార్కెట్ ని పరుగులు పెట్టిస్తుంది. బాలీవుడ్ చిత్రాలు `లాల్ సింగ్ చడ్డా`..`రక్షాబంధన్` లాంటి సినిమాల్ని సైతం వెనక్కి నేటి బాక్సాఫీస్ రేసులో దూసుకుపోతుంది. తాజాగా ఈ పరిణమాన్ని ఉదహరించి సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ `కార్తికేయ-2` పై ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసారు. ``నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించగా అభిషేక్ నిర్మించిన చిత్రం కార్తికేయ 2. ఈ మూవీ సినిమా విడుదలై రెండో వారంలో కూడా మంచి కలెక్షన్లని సాధిస్తోంది.
ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో ఆమీర్ ఖాన్ నటించిన `లాల్ సింగ్ చడ్డా`..` అక్షయ్ కుమార్` నటించిన రక్షాబంధన్ సినిమాలకంటే రెండు రెట్లు ఎక్కువగా వసూళ్లు సాధిస్తోంది. పెట్టుబడి మీద వచ్చిన ఆదాయ పరంగా పోల్చితే ఎస్ఎస్ రాజమౌళి సినిమా `ఆర్ఆర్ఆర్`.. ప్రశాంత్ నీల్ సినిమా `కేజీయఫ్ 2` కంటే `కార్తీకేయ 2`నే గొప్ప చిత్రం.
చందు మొండేటికి కంగ్రాట్స్' అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమా ని 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇప్పటికే వరల్డ్ వైడ్ 60 కోట్లకు పైగా వసూళ్లని సాధించింది. మరో 40 కోట్లు సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్చర్య పోనవసరం లేదు. అదే జరిగితే టాలీవుడ్ చరిత్రలో `కార్తికేయ-2`ని ఓ సంచలనంగా చెప్పొచ్చు.
సాధారణంగా ఇలాంటి రికార్డులు సాధించడం బాలీవుడ్ పరిశ్రమకే చెల్లింది. అక్కడి క్రియేటివ్ మేకర్స్ కంటెంట్ బేస్డ్ చిత్రాలు పరిమిత బడ్జెట్ లోనే తెరకెక్కించి 200-300 కోట్ల వసూళ్లు సాధిస్తారు. ఇటీవల రిలీజ్ అయిన `ది కశ్మీర్ ఫైల్స్` ఆ కోవకు చెందిన చిత్రమే.