Begin typing your search above and press return to search.
మహారాష్ట్రలో RRR టికెట్ 2200.. ఏపీలో 200 లేదు!-RGV
By: Tupaki Desk | 11 Jan 2022 6:00 AM GMTఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లపై తగ్గేదేలే! అంటూ ప్రభుత్వం భీష్మించుకుని కూచోవడం సినీపరిశ్రమకు మింగుడుపడడం లేదు. వినోదం సామాన్యులకు అందేందుకే ఈ ధరలు! అంటూ ప్రభుత్వం చెబుతోంది. కానీ సినీవిశ్లేషకులు ట్రేడ్ పండితులు టికెట్ రేట్ల అంశంపై రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. ఇక ఆర్జీవీ లాంటి ఉద్ధండుడు అసలు టికెట్ రేట్లపై ప్రభుత్వం అజమాయిషీ దేనికి? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఉత్పత్తిని తయారు చేసేవాడే ధరను నిర్ణయించాలని తన ఉద్ధేశాన్ని తెలిపారు. దీనిపై ఏపీ మంత్రి పేర్ని నానీతో డిబేట్ పెట్టారు ఆర్జీవీ. తనదైన శైలి లాజిక్ లతో ఆర్జీవీ మంత్రి పేర్ని నానిని ఇరకాటంలో పెట్టేసినా కానీ.. ఆయన సైలెంటుగా చట్టం ప్రకారం చేస్తున్నామని సరిపుచ్చారు.
కాసేపట్లో ఏపీలో టికెట్ ధరలపై నియమించిన కమిటీ కొత్త రేట్లను ప్రకటించనుంది. ఈలోగానే ఆర్జీవీ ట్విట్టర్ లో మరో ట్వీటేయడం అది వైరల్ గా మారడం చర్చనీయాంశంగా మారింది.
మహారాష్ట్ర ప్రభుత్వం రాజమౌళి తెరకెక్కించిన RRR టికెట్ ధరల్ని రూ.2200 కు అమ్ముకునేందుకు అనుమతించింది. కానీ ఏపీ లో టికెట్ ని రూ.200 కి అమ్ముకునేందుకు అయినా అనుమతించలేదు! ఇక్కడే ఉన్నదానిపై ఒక ప్రశ్న తలెత్తుతోంది. కట్టప్పను ఎవరు చంపారు? అన్నదే ఆ ప్రశ్న!! అంటూ తనదైన శైలిలో ఆర్జీవీ పంచ్ వేసారు.
మంత్రి పేర్ని నానీతో ఆర్జీవీ సచివాలయ భేటీకి ముందు రొయ్యలు చేపలు లాగించి వెళ్లిన ఆర్జీవీలో ఫైర్ మరింత పెరిగిందన్న గుసగుసా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆర్జీవీ జీవితంలో ఒకే ఒక్క మంచి పని చేశారు. అదేమిటీ అంటే టికెట్ రేట్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురెళ్లడమే అంటూ ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి. మరి కాసేపట్లో కొత్త టికెట్ ధరలను ఏపీ ప్రభుత్వం నియమించి కమిటీ వెల్లడించనుంది. ఇందులో ఆర్జీవీ వాదన ప్రతిఫలిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.