Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ తర్వాత లైన్‌ లో వైఎస్సార్‌, కేసీఆర్‌ : వర్మ

By:  Tupaki Desk   |   22 March 2019 8:40 AM GMT
ఎన్టీఆర్‌ తర్వాత లైన్‌ లో వైఎస్సార్‌, కేసీఆర్‌ : వర్మ
X
రామ్‌ గోపాల్‌ వర్మ ఏం చేసినా, ఏం తీసినా కూడా సంచలనమే అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా వర్మ తీసిన 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' చిత్రం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు తెర లేపిన విషయం తెల్సిందే. ఎన్నికల నేపథ్యంలో వర్మ సినిమా విడుదలకు టీడీపీ వారు అడ్డుకుంటున్నారు అంటే వర్మ ఏ స్థాయిలో రాజకీయాన్ని ఆ సినిమాలో చేసి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడును విలన్‌ గా చూపించి 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' చిత్రాన్ని తీస్తున్నట్లుగా వర్మ బాహాటంగా చెప్పాడు. ఇంతలా సంచలన ప్రకటనలు చేయడం వర్మకే చెల్లింది. ఇలాంటి సంచలన సినిమాలు వర్మ మాత్రమే తీయగలడు. అందుకే వర్మ ఈ సంచలనాలను కొనసాగిస్తాను అంటూ ప్రకటించాడు.

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం ఈనెల 29న విడుదల కాబోతున్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన వర్మ తాను త్వరలో వైఎస్‌ ఆర్‌ మరియు కేసీఆర్‌ ల బయోపిక్‌ ను కూడా తీయాలనుకుంటున్నట్లుగా ప్రకటించాడు. ఈ బయోపిక్‌ ల పర్వం ను ఎన్టీఆర్‌ తో వదిలేయకుండా వరుసగా సినిమాలు తీయాలని భావిస్తున్నట్లుగా వర్మ చెప్పిన నేపథ్యంలో ఆ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వైఎస్‌ ఆర్‌ సినిమా గురించి వర్మ స్టోరీ లైన్‌ కూడా రివీల్‌ చేశాడు.

వైఎస్‌ మూవీ కథను ఆయన మరణంతో ప్రారంభం అవుతుంది, వైఎస్‌ ఆర్‌ మరణం తర్వాత తెలుగు రాష్ట్రం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, వాటి వల్ల కొందరు పడ్డ లాభం, ఆ తర్వాత రాష్ట్రం విడిపోవడం వంటి విషయాలను చూపించబోతున్నట్లుగా వర్మ చెప్పుకొచ్చాడు. రాజశేఖర్‌ రెడ్డి బతికి ఉంటే ఏపీ విడిపోయేది కాదు అనే సందేశంతో ఈ మూవీ ఉండే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

వైఎస్‌ ఆర్‌ తర్వాత కేసీఆర్‌ మూవీ కూడా తీస్తానంటూ వర్మ చెప్పుకొచ్చాడు. వర్మ జీవితం గురించి తాను లోతుగా రీసెర్చ్‌ చేయిస్తున్నాను. ఆయన జీవితంలో ఏదైనా మంచి పాయిట్‌ దొరికితే వెంటనే సినిమాను తీస్తాను అంటూ వర్మ ప్రకటించాడు. మొత్తానికి ఎన్టీఆర్‌ తో వదలకుండా వరుసగా తెలుగు పొలిటికల్‌ లీడర్‌ ల జీవితాలను వెండి తెరపై ఆవిష్కరిస్తాను అంటూ వర్మ చెప్పుకొచ్చాడు.