Begin typing your search above and press return to search.
సెన్సార్ అధికారుల పై ఆర్జీవీ ఎటాక్?
By: Tupaki Desk | 27 Nov 2019 5:42 AM GMTకమ్మ రాజ్యం లో కడప రెడ్లు .. ఆర్జీవీ తాజా సెన్సేషన్. కుల రాజకీయాలు.. హత్యా రాజకీయాల్ని టచ్ చేస్తూ ఆయన తెరకెక్కించిన ఈ సినిమా ఈనెల 29న రిలీజ్ కి వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ ముంగిట సందిగ్ధావస్త ప్రస్తుతం పరిశ్రమ వర్గాలు సహా అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.
మరో రెండ్రోజుల్లో రిలీజ్ ఉండగా.. సెన్సార్ గడపపై క్లియరెన్స్ రాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. సెన్సార్ జరగనూ లేదు.. అవుతుందన్న క్లారిటీ లేక పోవడంతో ఆర్జీవీ అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. కులం.. రాజకీయం అంటూ ఆర్జీవీ మరోసారి వివాదాస్పద అంశాన్ని టచ్ చేయడంతో ఒక వర్గం ఆయనపై కత్తి కట్టిందన్న టాక్ ఇన్ సైడ్ సర్కిల్స్ లో వినిపించింది. అయితే సెన్సార్ ఫార్మాల్టీ లో ఇలాంటి వివాదాస్పద అంశాలేమిటి అన్నది తేలాల్సి ఉంటుంది. అభ్యంతరకర సన్నివేశాలు.. డైలాగులు ఉంటే కత్తెర వేయడం సహజమే. అయితే ఇప్పటివరకూ సెన్సార్ బృందం సినిమాని వీక్షించ లేదని రేపు మాపు అంటూ తాత్సారం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ డైలమాపై ఆర్జీవీ ఎంతో అసహనంగా ఉన్నారని తెలుస్తోంది.
అంతేకాదు.. దీని పై మీడియా ముందు డైరెక్టుగానే ఎటాక్ చేసేందుకు రెడీ అవుతున్నారట. సెన్సార్ అభ్యంతరాలుంటే రివిజన్ కమిటీ పరిశీలించాల్సి ఉంటుంది. అయితే సినిమానే చూడలేదు అంటే అసలేం జరుగుతోంది? అన్నది ఆర్జీవీ నే చెప్పాల్సి ఉంటుంది.