Begin typing your search above and press return to search.
రామ్ గోపాల్ వర్మకు అంత దమ్ముందా?
By: Tupaki Desk | 4 Jun 2022 10:40 AM GMTవివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా వివాదాస్పద చిత్రం 'కొండా'. వరంగల్ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన.. ఇంకా పోషిస్తూనే ఉన్నా కొండ మురళి మరియు సురేఖ ల జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన 'కొండా' సినిమా ను ఈనెల 23వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ తో సినిమాపై ఒక వర్గం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన వర్మ తాజాగా ట్రైలర్ 2 ను విడుదల చేశాడు.
సినిమా విడుదల తేదీని ప్రకటించడంతో పాటు ట్రైలర్ 2 విడుదల సందర్బంగా మీడియా ముందుకు కొండా చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి వర్మ వచ్చాడు. ఈ సందర్బంగా వర్మ చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో కేసీఆర్ బయోపిక్ కూడా చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. ఏ బయోపిక్ అయినా తాను ఉన్నది ఉన్నట్లుగానే ఎక్కువ శాతం చూపిస్తాను అంటూ వర్మ పేర్కొన్నాడు.
వర్మ మాట్లాడుతూ... నేను చదివింది విజయవాడ లో, విజయవాడ రౌడీయిజం.. రాయలసీమ ఫ్యాక్షనిజం మీద సినిమాలు చేశాను. తెలంగాణ గురించి ఎక్కువగా తెలియదు. ఎప్పుడైతే కొండ మురళి మరియు సురేఖ గార్ల గురించి తెలుసుకున్నానో అప్పుడే వారిద్దరి బయోపిక్ తీయాలని అనుకున్నాను. వారిని సినిమా గురించి అడిగినప్పుడు వారు కూడా ఒప్పుకున్నారు.
తల్లిదండ్రుల బయోపిక్ తీస్తున్నప్పుడు వారి కూతురు సుష్మిత నిర్మాతగా ఉంటానంటూ అడిగారు. అప్పుడు నేను కాదనలేదు. కొండ జీవితంలో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నప్పటికి నేను చాలా తక్కువ విషయాలను చూపించాను. నేను ఎప్పుడు కూడా బయోపిక్ లో లేనిది ఉన్నట్లుగా... ఉన్నది లేనట్లుగా చూపించలేదు. తప్పకుండా కొండా అందరిని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది.
కొండా రెస్పాన్స్ ను బట్టి సినిమాకు ప్రీక్వెల్ మరియు సీక్వెల్ ను కూడా ప్లాన్ చేస్తాను. కేసీఆర్ బయోపిక్ ఆలోచన కూడా ఉందని వర్మ పేర్కొన్నాడు. వర్మ ఇప్పటి వరకు ఎంతో మంది వివాదాస్పద వ్యక్తులకు సంబంధించిన బయోపిక్ లను తీశాడు.
కాని కేసీఆర్ బయోపిక్ తీసేంతటి దమ్ము వర్మకు ఉందా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్న కేసీఆర్ బయోపిక్ తీయడం అంటే మామూలు విషయం కాదు. అది వర్మకు ఇప్పట్లో సాధ్యం కాదంటూ కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.