Begin typing your search above and press return to search.

నాగబాబు నన్నే మించిపోయారు

By:  Tupaki Desk   |   8 Jan 2019 10:03 AM GMT
నాగబాబు నన్నే మించిపోయారు
X
బాలకృష్ణను టార్గెట్‌ చేస్తూ నాగబాబు గత కొన్ని రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు పీక్స్‌ కు చేరుకున్నాయి. బాలకృష్ణ వ్యాఖ్యలకు తన కామెంట్స్‌ అంటూ ఇప్పటికే అయిదు వీడియోలను విడుదల చేసిన నాగబాబు చర్చనీయాంశం అయ్యాడు. నాగబాబు కామెంట్స్‌ పై రకరకాల చర్చ జరుగుతుంది. ఎలాంటి బర్నింగ్‌ ఇష్యూలో అయినా తన ముద్ర లేకుండా ఉంటే ఎలా అనుకుంటాడో ఏమో కాని, వర్మ ఈ విషయంలో కూడా వేలు పెట్టాడు. నాగబాబు కామెంట్స్‌ కు సంబంధించిన ఒక వీడియోను పోస్ట్‌ చేసి తనదైన శైలిలో వర్మ స్పందించాడు.

నాగబాబు వ్యాఖ్యలపై వర్మ ట్విట్టర్‌ ద్వారా... కామెంట్స్‌ లో నన్ను మించిపోయారనే నా జసీ బాధ ఒకవైపు, తన స్టార్‌ బ్రదర్స్‌ ను బాగా డిఫెన్స్‌ చేయడంలో సూపర్‌ హిట్‌ అయిపోయారనే ఆనందం మరోవైపు.. ఒక కంట కన్నీరు, మరో కంట పన్నీరు.. నాగబాబు గారు హ్యాట్సాఫ్‌.. మీ బ్రదర్స్‌ అంటే మీకంటే నాకే ప్రేమ ఎక్కువ, వారిని నేనే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అంటూ పోస్ట్‌ చేశాడు. ఈ చిత్ర విచిత్రమైన వర్మ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ చర్చకు తెరలేపింది.

వర్మ ఈ విషయంలో ఎవరి పక్షాన నిల్చున్నాడో అర్థం కాకుండా, తనదైన శైలిలో తనకు పబ్లిసిటీ దక్కేలా ఈ పోస్ట్‌ చేశాడు. వర్మ ఈ ఇష్యూతో పబ్లిసిటీ దక్కించుకునే ప్రయత్నం చేశాడనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో నాగబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన వర్మ ఇప్పుడు హ్యాట్సాఫ్‌ నాగబాబు గారు అంటూ పోస్ట్‌ చేయడంలోనే అర్థం ఉంది. ఈ ట్వీట్‌ వ్యంగంగా చేసిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వర్మ ప్రస్తుతం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ అంటూ బాలయ్యకు వ్యతిరేకంగా ఒక సినిమా తీస్తున్నాడు. మరి ఆ కారణంగా మెగా కాంపౌండ్‌ కు వర్మ సపోర్ట్‌ పలికాడా అనేది కూడా కొందరు చర్చించుకుంటున్నారు. మొత్తానికి వర్మ ట్వీట్‌ మళ్లీ చర్చనీయాంశం అయ్యింది.