Begin typing your search above and press return to search.
వాళ్లు వంటలు చేస్తుంటే మేము సినిమా చేశాం
By: Tupaki Desk | 5 Dec 2020 1:34 PM GMTవివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సారధ్యంలో రూపొందిన 'కరోనా వైరస్' సినిమా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కరోనా లాక్ డౌన్ తర్వాత విడుదల కాబోతున్న మొదటి తెలుగు సినిమా ఇదే అవ్వడంతో అందరి దృష్టి ఈ సినిమాపై ఉంది. వర్మ ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా యూనిట్ సభ్యులతో మీడియా ముందుకు వచ్చాడు. ఎప్పటిలాగే తనదైన శైలిలో వివాదాస్పద చమత్కార మాటలతో సినిమాకు ప్రమోషన్ చేశాదు. ఈ సినిమా ను కరోనా రాకుంటే తీసి ఉండేవాళ్లం కాదన్నాడు.
వర్మ ఇంకా మాట్లాడుతూ.. సినిమాను పూర్తిగా లాక్ డౌన్ సమయంలోనే తెరకెక్కించాం. కరోనా సమయంలో అతి తక్కువ సిబ్బందితో కరోనా వైరస్ సినిమాను తెరకెక్కించిన సమయంలో చాలా మంది అవసరమా అన్నట్లుగా కామెంట్స్ చేశారు. ఇతర స్టార్స్ కిచెన్ లో చేరి వంటలు చేస్తుండగా.. కొందరు చెట్లకు నీళ్లు పోస్తుండగా మేము ఈ సినిమాను తీశాము.
కరోనా సమయంలో భయం లేకుండా నన్ను నమ్మి సినిమా చేసేందుకు ముందుకు వచ్చిన దర్శకుడు మంజు మరియు ఇతర చిత్ర యూనిట్ సభ్యులు మరియు నటీ నటులకు కృతజ్ఞతలు. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని ఆకట్టుకుంటుందనే నమ్మకం నాకు ఉందని ఈ సందర్బంగా వర్మ పేర్కొన్నాడు. కరోనాకు భయపడకుండా తాము తీసిన కరోనా వైరస్ సినిమా మేము కరోనాను ఛాలెంజ్ చేసినట్లుగా చెప్పుకొచ్చాడు.