Begin typing your search above and press return to search.
కరోనాకే కాదు.. శివసేనకు పట్టుకున్న కంగనాకు వ్యాక్సిన్ లేదు!
By: Tupaki Desk | 9 Sep 2020 5:30 PM GMTకంగన వర్సెస్ శివసేన ఎపిసోడ్ రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ముంబైలో కంగన కార్యాలయాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేయడంతో శివసేన అధినేతలపై ఫైర్ అయిన కంగన తాను ముంబైలో అడుగు పెడుతున్నానని ఏం చేస్కుంటారో చేస్కోమని సవాల్ విసిరింది. చెప్పిందే చేసి చూపించింది. ప్రస్తుతం ఇంటిని కార్యాలయాన్ని కూల్చివేసిన బీఎంసీపై న్యాయ పోరాటానికి కంగన సిద్ధమైంది.
ఇక ఈ మొత్తం వ్యవహారంపై ఆర్జీవీ తనదైన శైలిలో పంచ్ లు వేసారు. ఇండియాకు దాపరించిన కరోనాకు.. శివసేనకు పట్టుకున్న కంగనాకు వ్యాక్సిన్ లేదంటూ సెటైర్ వేశాడు. అక్కడితో ఆగకుండా పార్టీలన్నిటిపైనా ఆర్జీవీ తనదైన శైలిలో పంచ్ వేసాడు. కంగనా మహారాష్ట్ర సీఎం అవుతుందని.. అర్నబ్ పీఎం అవుతాడని.. కాంగ్రెస్ ఇటలీకి పారిపోతుందని పంచ్ వేశాడు. అలాగే శివసేన మాయమైపోతుందని కూడా అన్నాడు. వరుస ట్వీట్లలో సెటైర్లు వేస్తూ ఆర్జీవీ చెలరేగిపోయాడు.
ఇంతకుముందు రిపబ్లిక్ టీవీ యాంకర్.. విశ్లేషకుడు అర్నాబ్ గోస్వామిపై సినిమా తీస్తానని వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. మీడియా ప్రాస్టిట్యూట్ టైటిల్ ని రిజిస్టర్ చేయించానని తెలిపాడు. ఇక నెపోటిజం స్టార్లు కొంతవరకే జనాలు చూస్తేనే స్టార్లు అవుతారని పంచ్ లు వేసాడు. బంధుప్రీతి వల్ల ప్రయోజనం ఉండదని కూడా అన్నారు. సుశాంత్ కేసులో బాలీవుడ్ ని దోషిని చేసినా స్టార్లు ఎవరూ మాట్లాడకపోవడంపై పంచ్ లు విసిరాడు.
చివరిగా శివసేన .. బాల్ థాక్రేల్ని ఆర్జీవీ వదిలిపెట్టలేదు. శివసేన ఇలా తయారైతే పెద్దాయన ఆత్మ కలత చెందుతుందని పంచ్ విసిరాడు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇలా అయిపోయిందేమిటి? అని కూడా దెప్పి పొడిచాడు. ఇక కంగనపై కౌంటర్ ఎటాక్ విషయంలో వర్మ ఎక్కడా తగ్గలేదు. కంగనను .. బాలీవుడ్ స్టార్లను.. శివసేనను.. చివరికి ఎవరినీ ఆర్జీవీ వదలకపోవడం ఆసక్తికరం.