Begin typing your search above and press return to search.

వర్మ 'మా' సర్కస్‌ వ్యాఖ్యలతో మరింత హీట్‌

By:  Tupaki Desk   |   17 Oct 2021 10:50 AM GMT
వర్మ మా సర్కస్‌ వ్యాఖ్యలతో మరింత హీట్‌
X
మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌ అధ్యక్ష ఎన్నికలు ఈసారి రాజకీయ ఎన్నికలను తలపించాయి. ఎన్నికల సమయంలో జరిగిన హడావుడి అంత సులభంగా ఎవరు మర్చి పోరు. ఎన్నికల ముందు ప్రచారం సమయంలో ఒకరిని ఒకరు ఢీ అంటే ఢీ అన్నట్లుగా విమర్శించుకున్నారు. ఎన్నికల రోజు కొట్టుకోవడం మొదలుకుని కొరుక్కోవడం వరకు అన్ని రకాల హంగామాలు జరిగాయి. మా ఎన్నికలు పూర్తి అయిన తర్వాత సహజంగా అయితే అంతా సైలెంట్‌ అవుతుంది. కాని ఈసారి అలా సైలెంట్‌ అవ్వలేదు. ఎన్నికలు జరిగి వారం అయినా కూడా ఇంకా హంగామా కనిపిస్తూనే ఉంది. పెద్ద ఎత్తున మీడియా సమావేశాలు.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ మా ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారు.

మా పెద్దలు ఇప్పటి వరకు కనీసం స్పందించడం లేదు. ఏ ఒక్కరు కూడా ఈ విషయాన్ని ముగించేందుకు ప్రయత్నించడం లేదు. మా పెద్దలు ఈ విషయంలో పట్టించుకోక పోవడంకు తోడు గాలికి వదిలినట్లుగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఈ వ్యవహారం సాగుతూనే ఉంది. తాజాగా వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఈ విషయమై స్పందించాడు. మా సభ్యులు తాము సర్కస్ బ్యాచ్‌ అని ప్రేక్షకుల ముందు మళ్లీ ప్రూవ్‌ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ట్వీట్‌ చేశాడు. వర్మ ట్వీట్‌ ను చాలా మంది సమర్థిస్తున్నారు. ఎందుకంటే మా సభ్యుల ప్రవర్తన అంతే దారుణంగా ఉంది. వారు రోజు రోజు ఏదో ఒక విషయంతో మీడియాలో ఉంటూ జనాలను సినిమాలతో ఎంటర్‌ టైన్ చేయడం మాత్రమే కాకుండా ఎన్నికల కారణంగా మీడియా సమావేశాల తో ఎంటర్‌ టైన్ చేస్తున్నారు.

రామ్‌ గోపాల్ వర్మ మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌ పై చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇండస్ట్రీలో ఏ ఇష్యూ జరిగినా కూడా ఆయన స్పందించకుండా ఉండదు. కాస్త లేట్ అయినా కూడా సర్కస్‌ అంటూ బలమైన పదాన్ని ఉపయోగించి వర్మ చేసిన కామెంట్స్ సూపర్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. నెట్టింట ఈ విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గెలిచిన వారికి మద్దతు ఇస్తామంటూ చెప్పి ప్రకాష్‌ రాజ్ టీమ్‌ సైలెంట్ గా ఉండి ఉంటే వచ్చే ఇబ్బంది ఏమీ ఉండేది కాదు. కాని ప్రకాష్‌ రాజ్‌ ప్యానల్ ద్వారా గెలిచిన వారు అంతా కూడా రాజీనామాలు చేయడం ద్వారా అసలు చర్చ మొదలు అయ్యింది. మరో వైపు నరేష్‌ వ్యాఖ్యలు కూడా కాస్త సీరియస్ గా పరిస్థితి మారే విధంగా చేశాడు. మొత్తానికి మా వివాదం మరీ ముదరడంలో రెండు వర్గాల పాత్ర ఉంది అంటూ బయటి వారు చెబుతున్నారు.