Begin typing your search above and press return to search.
అసలు బ్రూస్ లీ పేరెందుకు పెట్టారు??
By: Tupaki Desk | 16 Oct 2015 2:12 PM GMTమొదటి నుండి రామ్ చరణ్ 'బ్రూస్ లీ' సినిమాపై తన ప్రతాపం చూపిస్తూనే ఉన్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మనోడు బ్రూస్ లీ పేరుతో ఒక సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశాడు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక.. అసలు మీరు సినిమాకు బ్రూస్ లీ అనే పేరును ఎందుకు పెట్టారు అంటున్నాడు.
'బ్రూస్ లీ' లో రామ్ చరణ్ నటనను ప్రశంసిస్తూనే మరోవైపు పంచ్ వేశాడు వర్మ. ఈ సినిమాకు బ్రూస్ లీ అని పేరు పెట్టకపోయి ఉంటే రామ్ చరణ్ చేసిన నటన అద్బుతంగా ఉండేది.. కాని బ్రూస్ లీ అన్నారు కాబట్టి.. నేను అక్కడ బ్రూస్ లీ నే ఊహించుకున్నా.. బ్రూస్ లీ లేని ఈ సినిమాకు ఆ పేరు ఎందుకు పేరు పెట్టారో బ్రూస్ లీ అభిమానిగా తనకు అర్థం కాలేదని ట్వీట్ల వర్షం కురిపించాడు రామ్ గోపాల్ వర్మ.
ఇకపోతే ఇదే చిరంజీవి 150వ సినిమా అన్నట్లు.. ''బాస్ తన 50వ సినిమా కోసం ఎందుకు 'బ్రూస్ లీ'ని ఎంచుకున్నాడో ఆశ్చర్యం కలిగిస్తోంది. మెగాస్టార్ మెగాఫ్యాన్ గా, బ్రూస్ లీ పవర్ ఫ్యాన్ గా చిరంజీవి 151వ సినిమా మెగా కిక్కింగ్ పవర్ పంచ్ ఇస్తుందని ఆశిస్తున్నా'' అంటూ అటు చిరంజీవిపైనా ఒక ట్వీటాస్ర్తం వేశాడు గురుడు.
ఈ ట్వీట్లపై ప్రస్తుతం మెగా ఫ్యాన్సు ఒకవైపు.. ఇతర సినిమా అభిమానులు ఒకవైపు చర్చించుకుంటున్నారు. మళ్ళీ మరి బండ్ల గణేష్ ఏదైనా రిప్లయ్ ఇస్తాడేమో చూద్దాం.