Begin typing your search above and press return to search.
రాజమౌళి వల్లే టాలీవుడ్ లో ఈ సమస్యలు : వర్మ
By: Tupaki Desk | 3 Aug 2022 2:33 PM GMTవివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం తెలుగు సినిమా నిర్మాతలు చేస్తున్న సమ్మెపై విభిన్నంగా స్పందించాడు. ఒక టీవీ ఛానల్ యొక్క చర్చ కార్యక్రమంలో పాల్గొన్న వర్మ మాట్లాడుతూ నిర్మాతల సమ్మెను తప్పుబట్టారు. సినిమా అనేది ఒక బిజినెస్ దాన్ని సరిగా చేసుకోలేక హీరోల పారితోషికం.. దర్శకులపై మండి పడటం వంటి పనులు చేయడం ఏంటీ అంటూ వర్మ అసహనం వ్యక్తం చేశాడు.
నిర్మాత ఒక బిజినెస్ మ్యాన్... ఆయన బిజినెస్ సరిగ్గా చేసుకుంటేనే లాభాలు వస్తాయి. అంతే తప్ప ఆయన ఏమీ ఊరికే హీరోలకు టెక్నీషియన్స్ కు పారితోషికాలు ఇవ్వడం లేదు. వారి స్థాయికి తగ్గట్లుగా పారితోషికాలు డిమాండ్ చేస్తున్నారు.. నిర్మాతలు ఇవ్వాల్సి ఉంది. అంతే తప్ప వారికి ఏం ఛారిటీ గా పారితోషికాలు నిర్మాత ఇవ్వడం లేదన్నాడు.
జనాలు థియేటర్లకు ఎందుకు రావడం లేదు అనే విషయమై వర్మ స్పందిస్తూ.. గతంతో పోల్చితే పరిస్థితులు చాలా మారాయి. ఇంట్లోనే ఎంటర్ టైన్‌మెంట్ పూర్తి స్థాయిలో వస్తున్నప్పుడు సినిమా థియేటర్ కు వెళ్లి సినిమా ను రెండున్నర మూడు గంటలు చూసే ఓపిక.. అంత ఖర్చు పెట్టేందుకు ఇష్టం ఉండటం లేదని వర్మ అన్నాడు.
ప్రేక్షకులు థియేటర్ల కు రావాలంటే బాహుబలి.. కేజీఎఫ్.. ఆర్ ఆర్ ఆర్ రేంజ్ సినిమాలు కావాలని ఆశిస్తున్నారు. రాజమౌళి బాహుబలి తో వచ్చిన తర్వాత ప్రేక్షకులు చిన్న స్థాయి సినిమాలను చూసేందుకు ఆసక్తి చూడం లేదు అనేది వర్మ వాదన. రాజమౌళి అనే భూతం వచ్చి ప్రేక్షకుల యొక్క ఆలోచన విధానం ను పూర్తిగా మార్చేసి ఇండస్ట్రీ లో ఈ పరిస్థితికి కారణం అయ్యారంటూ వర్మ పేర్కొన్నాడు.
రాజమౌళి తో పాటు ఓటీటీలు మాత్రమే కాకుండా యూట్యూబ్ కూడా ప్రేక్షకులను థియేటర్ వైపు చూడకుండా చేస్తున్నాయంటూ వర్మ అభిప్రాయం వ్యక్తం చేశాడు. యూట్యూబ్ తో ఇప్పుడు ఎక్కువ మంది సమయం గడుపుతున్నారు. ఆ యూట్యూబ్ వల్ల ఎక్కువ శాతం మంది సినిమా థియేటర్ల కు వచ్చే యోచన కూడా చేయడం లేదని వర్మ అంటున్నాడు.
నిజమే వర్మ అన్నట్లుగా ప్రేక్షకులు భారీ సినిమాలను మాత్రమే చూడాలని కోరుకుంటున్నారు. చిన్న సినిమాలు వస్తే ఓటీటీ లేదా టీవీల్లో వచ్చే వరకు వెయిట్ చేద్దాం లేదా యూట్యూబ్ లో ఆ సినిమా సన్నివేశాలు ఏమైనా వస్తే చూద్దాం అన్నట్లుగా ఉంటున్నాడు. అందుకే సినిమా ఇండస్ట్రీకి ఈ పరిస్థితి అంటూ వర్మ వ్యాఖ్యలతో చాలా మంది ఏకీభవిస్తున్నారు.