Begin typing your search above and press return to search.

నిర్మాతపై ఫిర్యాదు చేసిన రామ్‌ గోపాల్‌ వర్మ?

By:  Tupaki Desk   |   20 July 2022 10:34 AM GMT
నిర్మాతపై ఫిర్యాదు చేసిన రామ్‌ గోపాల్‌ వర్మ?
X
రామ్‌ గోపాల్‌ వర్మకు వివాదాలు కొత్త కాదు.. ఆయన సినిమాలు చివరి నిమిషంలో ఆగి పోవడం కొత్తేం కాదు. కానీ ఆయన తాజా చిత్రం 'లడ్కీ ఎంటర్‌ ది డ్రాగన్' విడుదల అయిన తర్వాత ప్రదర్శణ నిలుపుదల చేయించారు. నిర్మాత శేఖర్ రాజు తనకు రామ్‌ గోపాల్‌ వర్మ నుండి డబ్బులు రావాల్సి ఉంది. ఆ డబ్బు వచ్చే వరకు సినిమాను నిలిపేయాలంటూ కోర్టు నుండి స్టే ఆర్డర్‌ ను తీసుకు వచ్చాడు.

సినిమా నిలుపుదల స్టే ఆర్డర్ పై రామ్‌ గోపాల్‌ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శేఖర్ రాజు కు తాను డబ్బు ఇవ్వాల్సి ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నిజం కాదు.. చూపిస్తున్న ఫ్రూప్స్ నిజం కాదని తేల్చి చెప్పాడు. తాను శేఖర్ రాజు నుండి ఎప్పుడు కూడా డబ్బు తీసుకోలేదు అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. తప్పుడు పత్రాలు సమర్పించి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నాడు అంటూ ఆర్జీవీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పంజాగుట్ట సీఐ హరీష్ చంద్రారెడ్డికి రామ్‌ గోపాల్‌ వర్మ ఫిర్యాదు ఇచ్చాడు. రాత పూర్వకంగా శేఖర్‌ రాజు మోసం పై ఫిర్యాదు ఇచ్చిన ఆర్జీవీ తాను అతడి నుండి ఎలాంటి డబ్బు తీసుకోలేదని సాక్ష్యాలను కూడా సమర్పించాడు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన రామ్‌ గోపాల్‌ వర్మ పలు విషయాలను ప్రస్థావిస్తూ శేఖర్‌ రాజు పై తీవ్రస్థాయిలో మండి పడ్డాడు.

రామ్ గోపాల్‌ వర్మ మాట్లాడుతూ.. సినిమా అనేది ఎంతో మందికి సంబంధించిన విషయం. అలాంటి సినిమా ను ఒక్కరు ఇద్దరు మద్య జరిగిన వివాదం.. విభేదాల వల్ల చివరి నిమిషంలో ఆపడం మంచిది కాదు. దీన్ని ఇండస్ట్రీ కి చెందిన వారు గుర్తించుకోవాలి. మళ్లీ ఏ సినిమాకు ఇలా జరగకూడదు అనే ఉద్దేశ్యంతో తాను ఇలా పోలీస్‌ స్టేషన్ కు వచ్చినట్లుగా పేర్కొన్నాడు.

తాను నిర్మాత శేఖర్ రాజు కు నగదు ఇచ్చేది ఏమీ లేదని.. అతడు తప్పుడు పత్రాలను చూపించి తన సినిమాను ఆపించాడు అంటూ ఆర్జీవీ ఆరోపిస్తున్నాడు. ఏ ఒక్కరిని వదిలేది లేదు. సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరు కూడా శేఖర్ రాజు పై కేసు వేయబోతున్నట్లుగా పేర్కొన్నారు. సినిమా ఆపేయడం వల్ల వందల మంది నష్టపోతారు. కనుక వారందరు కూడా ఇప్పుడు శేఖర్‌ రాజు పై ఫిర్యాదు చేయబోతున్నారని ఆర్జీవీ అన్నాడు.

సినిమా చేస్తానంటూ తనతో చెప్పడం వల్ల పలు దఫాలుగా డబ్బు ఇచ్చానంటూ శేఖర్‌ రాజు చెబుతున్నాడు. కానీ వర్మ మాత్రం అసలు డబ్బు తీసుకోలేదు అంటున్నాడు. ఇద్దరిలో ఎవరిని నమ్మాలో పోలీసుల ఎంక్వౌరీ లో తేలుతుంది.