Begin typing your search above and press return to search.

అల ఏకాంతంలో.. మియాతో వర్మ!

By:  Tupaki Desk   |   22 May 2020 2:41 PM GMT
అల ఏకాంతంలో.. మియాతో వర్మ!
X
దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ వివాదాలకు తెరలేపడమే కాదు.. సినిమాలను వివాదంగా రూపొందించడంలో కూడా తోపు. ఈ మధ్యకాలంలో వర్మ చేసిన సినిమాల‌న్నీ వివాదాల్లో చిక్కుకుని వరుసగా పరాజయం పాలయ్యాయి. వర్మ సినిమాలు ఏ నేప‌థ్యంలో వ‌చ్చినా ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. ఆయన సినిమాలు మొదలైనప్పటి నుండి విడుదల అయ్యేవరకు మీడియాకు వర్మ సినిమాల గురించి పెద్ద పనే ఉంటుంది. ఇక లాక్ డౌన్ టైంలో తాజాగా మరో భిన్నమైన సస్పెన్స్ సినిమాతో ప్రేక్షకుల‌ ముందుకు రాబోతున్నాడు వర్మ. శృంగారతార మియా మల్కోవాను ప్రధాన పాత్రధారిగా ‘క్లైమాక్స్‌’ అనే శృంగారభరిత యాక్షన్ థ్రిల్ల‌ర్‌ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ షార్ట్ ఫిల్మ్ మొత్తం ఓ ఎడారి నేపథ్యంలో సాగే ప్రేమ జంట కథ అని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. శృంగార తార మియా మాల్కోవాతో ఎడారిలో ఏకాంతంగా ముచ్చటిస్తున్న ఫోటో పోస్ట్ చేసాడు.

ఆ ఫోటోకి ‘ఎ షాట్ విత్ మియా మాల్కోవా.. క్లైమాక్స్ సన్నివేశం కోసమే సామాజిక దూరం పాటిస్తూ చర్చిస్తున్నాం’ అంటూ ఆమెతో ఎడారిలో కూర్చొని మాట్లాడుతున్నా.. అంటూ ట్యాగ్ లైన్ జతచేసాడు. ఈ ఫోటో చూసిన నెటిజన్స్ ఆసక్తికరంగా కామెంట్స్ గుప్పిస్తున్నారు. ఈ లాక్‌డౌన్‌లో అక్కడ షూట్ ఎలా చేశారు? పర్మిషన్ ఎలా దొరికిందని..? కొందరు అడుగుతుంటే.. చాలామంది లైకులు, రీ ట్వీట్స్.. షేర్స్ చేస్తూ హోరెత్తిస్తున్నారు. మొత్తానికి శృంగార తార మియాతో గతంలో జిఎస్టి సినిమాను తీసిన వర్మ ఈసారి ‘క్లైమాక్స్’తో ప్రకంపనలు రేపేలా ఉన్నాడు. ఇక ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్లు సోషల్ మీడియాను దుమ్ము రేపుతున్నాయి. యాక్షన్ థ్రిల్లింగ్ స్టోరీతో శృంగార సన్నివేశాలను పండిస్తూ.. క్రైమ్ చేస్తున్నాడు వర్మ. ఈ సినిమాను మే 29వ తేదీన #RGVWorldTheatre @shreyaset యాప్‌లో రిలీజ్ చేస్తున్నట్లు వర్మ ప్రకటించారు.