Begin typing your search above and press return to search.
లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల.. కోర్టుకు ఆర్జీవీ
By: Tupaki Desk | 17 March 2019 11:28 AM GMTరామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ను మార్చ్ 22 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ సినిమాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నెగెటివ్ గా చూపించారని.. రానున్న ఎన్నికలపై ఇది ప్రభావం చూపిస్తుందని టీడీపీ కార్యకర్త దేవిబాబు చౌదరి కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేస్తూ సినిమా విడుదలను ఆపాలని కోరారు. కానీ ఎలెక్షన్ కమీషనర్ రజత్ కుమార్ రీసెంట్ గా మాట్లాడుతూ సినిమా విడుదలను ఆపేందుకు ఎలెక్షన్ కమీషన్ ఎలాంటి చర్య తీసుకోదని తెలిపారు.
ఇదిలా ఉంటే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ను సెన్సార్ చేయాలనే అప్లికేషన్ ను పరిశీలించిన సెంట్రల్ బోర్డు అఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) వారు ఫస్ట్ ఫేజ్ ఎలెక్షన్స్(11-04-2019) పూర్తయ్యే వరకూ ఈ సినిమా సెన్సార్ స్క్రీనింగ్ కుదరదని రీసెంట్ గా తేల్చి చెప్పారు. ఈ లెక్కన సర్టిఫికేట్ రాకుండా ఎలెక్షన్స్ లోపు ఈ సినిమాను రిలీజ్ చేయలేరు. దీంతో అప్సెట్ అయిన ఆర్జీవీ కాసేపటి క్రితం తన సినిమా విడుదలను అన్యాయంగా అడ్డుకుంటున్న సెన్సార్ వారిపై కోర్టుకు వెళ్తున్నానని తెలిపాడు.
అసలు సెన్సార్ బోర్డ్ వారికి ఎలెక్షన్ కోడ్ పేరిట సినిమా సెన్సార్ స్క్రీనింగ్ ను డిలే చేసే అధికారం లేదని.. అసలు సినిమాను చూడకుండా అలా ఎలా చేస్తారని ప్రశించాడు. ఇది ఒకరకంగా ప్రీ-సెన్సార్ షిప్ లాంటిదని .. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రసాదించిన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ ను అడ్డుకోవడమే అన్నాడు. రాజకీయ పార్టీలతో కానీ ఎన్నికలలో నిలబడే అభ్యర్థులతో కానీ తనకు సంబంధం లేదన్నాడు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' టీమ్ కు చెందిన వారెవ్వరూ ఎలెక్షన్స్ లో పాల్గొనడం లేదని తెలిపాడు. అందుకే సెన్సార్ బోర్డు వారి అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్తున్నానన్నాడు.