Begin typing your search above and press return to search.
షాక్: ట‌్రైలర్ ఫర్ సేల్.. కొనేదెవరు ఆర్జీవీ?
By: Tupaki Desk | 14 July 2020 11:30 AM GMTక్రేజు లేని సినిమాలకు రేంజు పెంచడమెలా? అసలు ఎవరూ చూడని ప్లాస్టిక్ ముఖాల్ని సైతం ఫోటోషూట్లతో లుక్ మార్చేసి వైరల్ చేయడమెలా? అణా పైసా పబ్లిసిటీ ఖర్చు లేకుండా తెలుగు సినిమాల్ని వరల్డ్ ఆడియెన్ కి చేరువ చేయడమెలా? ఏదో ఒకటి చేసి మీడియాని పప్పీలా తన చుట్టూనే తిప్పుకోవడమెలా? ఉన్నదీ లేనిదీ క్రియేట్ చేసి వివాదాలతో ప్రచారం కొట్టేయడం ఎలా? ఇలాంటి గజకర్ణ గోకర్ణ విద్యల్లో ఆర్జీవీది అందెవేసిన చేయి. దశాబ్ధాల పాటు అసలు హిట్టు అన్నదే లేకుండా కెరీర్ బండిని నెట్టుకొచ్చిన ఏకైక ఘనుడిగానూ ఆయన రికార్డుల్ని వేరే ఎవరూ బద్ధలు కొట్టలేరేమో!
ఏదైతేనేం.. ఇప్పుడు మరో కొత్త అంకానికి తెర తీశాడు. సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టాడు. ప్రస్తుతం `పవర్ స్టార్` అంటూ పవన్ కల్యాణ్ రాజకీయ జీవితంపై సెటైరికల్ పొలిటికల్ డ్రామాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. జూలై 24న ఈ సినిమా ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో రిలీజ్ కానుంది. అంతకుముందే ట్రైలర్ ట్రీట్ ఇచ్చేందుకు వర్మ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇంతకీ ట్రైలర్ ఎక్కడ రిలీజవుతుంది? అంటే.. "అన్ని ట్రైలర్లు ఒకే తీరుగా ఉండవు. ఉచితంగా అసలే దొరకవ" అని అంటున్నాడట ఆర్జీవీ. పవర్ స్టార్ ట్రైలర్ చూడాలంటే ఒక్కో వ్యూకి రూ.50 చెల్లించాలట. పైగా యూట్యూబ్ లో ఈ ట్రైలర్ అందుబాటులోకి రాదు. ఆర్జీవీ థియేటర్ లోనే చూడాలట. ఇప్పటివరకూ చిత్రబృందం ఈ విషయాన్ని అధికారికంగా ఎక్కడా చెప్పలేదు కానీ మైండ్ గేమ్ ఆడే వర్మ అలా చేసేందుకు సిద్ధమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఆర్జీవీ కొత్త రూల్ చూస్తుంటే ప్రపంచంలోనే ఇలాంటి వేరొక దర్శకుడు ఉండడు అని అర్థమవుతోంది కదా! అయినా ట్రైలర్ వీక్షణకు 50 రూపాయలు చెల్లించేవాళ్లుంటారా? పైగా అదేమైనా జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్ 2 నా అనుకుంటున్నారా? అయితే అక్కడే ఉంది లాజిక్కు. ఇప్పటికే పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆర్జీవీపై గుర్రు మీద ఉన్నారు. ఎక్కడ తేడా వచ్చినా వర్మను అటకాయించేందుకు రెడీ అవుతున్నారన్న సమాచారం ఉంది. అంటే దీనర్థం .. క్రేజు ఉందనే కదా! సరిగ్గా ఈ క్రేజునే క్యాష్ చేసుకునేందుకు ఆర్జీవీ ఇలాంటి పన్నాగం పన్ని ఉంటాడని భావించాలేమో!