Begin typing your search above and press return to search.
35ఏళ్ల కెరీర్ లో ఒక్క సెలవైనా తీసుకోలేదన్న ఆర్జీవీ
By: Tupaki Desk | 21 April 2021 8:33 AM GMTవివాదాస్పద దర్శకుడిగా ఆర్జీవీ నిరంతరం ఏదో ఒక టాపిక్ తో అభిమానుల ముందుకు వస్తుంటారు. ఈసారి కూడా ఆర్జీవీ పాత సినిమాని పేరు మార్చి దెయ్యం అంటూ రిలీజ్ చేశారు. కానీ అది మహమ్మారీ క్రైసిస్ లో దారుణ ఫలితాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్ల సమయంలో దారుణమైన ప్రకటనలు చేయడం ద్వారా ఆర్జీవీ తన సినిమాను ట్రెండింగ్ టాపిక్ గా మార్చడానికి ప్రయత్నించారు. కానీ ఆయన పప్పులేవీ ఉడకనే లేదు. దెయ్యం వచ్చి వెళ్లిన సంగతి కూడా ఎవరికీ తెలీదు.
ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ ఒక ఆసక్తికర విషయం చెప్పారు. తన 35 ఏళ్ల కెరీర్ లో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని ఆర్జీవీ అనడం ఆశ్చర్యపరిచింది. నిజానికి అతడు నిరంతరం ఏదో ఒక సినిమా తీస్తూ బిజీగా ఉంటారన్నది అందరికీ తెలిసినదే. అయినా కానీ ఇలా సెలవు లేకపోవడమే ఆశ్చర్యపరుస్తోంది.
``నేను సినిమాలు వెబ్-సిరీస్ లతో చాలా బిజీగా ఉన్నాను. పని నా అతిపెద్ద సెలవు. నేను కుటుంబంతో ఉండే వ్యక్తిని కాదు. నాకు చాలా మంది స్నేహితులు లేరు``అని కూడా RGV చెప్పారు.
కొన్నేళ్లుగా ఆర్జీవీ సినిమాలేవీ ఆడడం లేదు. జనం అస్సలు చూడడం లేదు. కానీ ఆయన సినిమాలు తీస్తూనే ఉన్నారు. ఆదరణతో పని లేకుండా ఆయన కెరీర్ ని సాగిస్తున్నారు. అతని వ్యాపార నమూనా ఇప్పటికీ చాలా మందికి అర్థం కాని రహస్యం. ఇకపోతే జనం చూసినా చూడకపోయినా నేను సినిమాలు తీస్తూనే ఉంటానని అసలు నా సినిమాల్ని జనం చూడాల్సిన అవసరమే లేదని ప్రకటించిన ఏకైక దర్శకుడిగానూ ఆయనకు గుర్తింపు ఉంది.