Begin typing your search above and press return to search.

ఆ పదానికి అర్ధమే తెలీదట వర్మకు

By:  Tupaki Desk   |   26 Oct 2021 1:30 PM GMT
ఆ పదానికి అర్ధమే తెలీదట వర్మకు
X
వివాదం ఎక్కడుంటే రామ్ గోపాల్ వర్మ అక్కడుంటారు. లేకపోతే వర్మ ఉన్నచోట్లే వివాదం ఉంటుంది. నిజానికి రెండింటిలో ఏది కరెక్టంటే రెండూ కరెక్టే అనే చెబుతారు ఎవరైనా. వివాదాస్పద దర్శకుడు వర్మ ట్రాక్ రికార్డు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇదే మాటంటారు. కానీ ఇపుడు మాత్రం తనను వివాదాల్లోకి లాగవద్దని స్వయంగా వర్మే కోరుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి టీడీపీ నేత పట్టాభి బోసిడీకే అని తిట్టడం, వైసీపీ నేతల దాడుల గురించి అందరికీ తెలిసిందే.

ఇదే విషయమై గడచిన ఐదురోజులుగా రెండుపార్టీల నేతల మధ్య ఆవేశకావేశాలు హద్దులు దాటిపోతున్నాయి. ఈ నేపధ్యంలోనే చంద్రబాబునాయుడు వ్యూహాత్మకంగా వివాదాన్ని జాతీయస్ధాయికి తీసుకెళ్ళారు. ఢిల్లీకి చేరుకుని రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ కు కూడా ఫిర్యాదు చేశారు. మామూలుగా వర్మ ఇలాంటి వివాదాలను వదిలేసే రకంకాదు. వివాదంలో మరింత ఆజ్యంపోసి మంటను ఎగేసే రకమే.

అయితే తన సహజతత్వానికి విరుద్ధంగా ఈ వివాదంలోకి తనను లాగవద్దంటున్నారు. జగన్ను తిట్టడానికి టీడీపీ నేత ఉపయోగించిన తిట్టు సంగతి తనకు తెలీదని, దాని అర్ధం కూడా తనకు తెలీదన్నారు. ఇప్పటికే ఈ విషయమై చాలామంది మాట్లాడేశారు కాబట్టి తనకు ఇక మాట్లాడే అవకాశం కానీ లేకపోతే ఉద్దేశ్యం కానీ లేదన్నారు. డక్షనరీలు చూసి అర్ధం వెతికేంత టైం కూడా తనకు లేదన్నారు. అందుకనే ఆ వివాదంపై తనతో మాట్లాడించవద్దని మీడియాను వర్మ కోరుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలో కొండా సినిమా షూటింగ్ సమయంలో తనను కలసిన మీడియాతో పిచ్చాపాటి మాట్లాడి పంపేశారు.

ఏపీ నేతలు తొందరలోనే బాక్సింగ్, కరాటే నేర్చుకోవాలని ట్వట్టర్ వేదికగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఎక్కడ వివాదం రేగినా అందులోకి దూరిపోయే వర్మ తాజా వివాదానికి దూరంగా ఉండాలని అనుకోవటమే విచిత్రంగా ఉంది. బహుశా తాజా వివాదం ఒకవైపు జగన్మోహన్ రెడ్డి-మరోవైపు చంద్రబాబునాయుడు మధ్య నడుస్తుండటమే కారణమై ఉండచ్చు. వీళ్ళద్దరి మధ్య జరుగుతున్న వివాదంలోకి తాను వేలుపెడితే తనకే రివర్సయినా అవుతుందని వెనకాడినట్లే అనిపిస్తోంది.