Begin typing your search above and press return to search.

చైనా ఫిలిం ఫెస్టివల్ కు ఆర్జీవీ 'లడకీ'..!

By:  Tupaki Desk   |   9 Nov 2021 10:00 AM GMT
చైనా ఫిలిం ఫెస్టివల్ కు ఆర్జీవీ లడకీ..!
X
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ''లడకీ''. 'ఎంటర్ ది గర్ల్ డ్రాగన్' అనేది దీనికి ట్యాగ్ లైన్. ఆర్ట్ సి మీడియా - చైనా కు చెందిన బిగ్ పీపుల్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇది ఇండియాలోనే ఫస్ట్ రియలిస్టిక్ మార్షల్ ఆర్ట్స్ మూవీగా ఆర్జీవీ పేర్కొన్నారు. ఇందులో ఫస్ట్ ఫిమేల్ మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ పూజా భలేకర్ లీడ్ రోల్ పోషించింది. ఇప్పటికే విడుదల చేయబడిన పుజా ఫొటోలు - వీడియోలు సోషల్ మీడియాలో హీట్ పుట్టించాయి. ఈ క్రమంలో సినిమా ట్రైలర్ ను వర్మ సోమవారం రిలీజ్ చేశారు.

'నీరు ప్ర‌వ‌హించ‌వచ్చు లేదా పోటెత్త‌వ‌చ్చు.. నువ్వు మాత్రం నీటిలాగే ఉండాలి' అని పూజా భ‌లేక‌ర్ కు ఆమె ట్రైన‌ర్ చెప్పడంతో ఈ ట్రైల‌ర్ ప్రారంభమైంది. మార్ష‌ల్ ఆర్ట్స్ హీరో బ్రూస్ లీ స్ఫూర్తితో ఫైటర్ గా మారిన యువ‌తి జీవితంలో జరిగే సంఘటన సమూహారమే ఈ సినిమా అని తెలుస్తోంది. ఇందులో యాక్షన్ తో పాటుగా ప్రేమ - రొమాన్స్ వంటి కుర్రకారుని ఆకట్టుకునే మసాలా అంశాలు ఉన్నాయి. పూజా భ‌లేక‌ర్ ఓ వైపు యాక్ష‌న్ తో అద‌ర‌గొడుతూనే.. మ‌రోవైపు అందాల‌ను ఆర‌బోస్తోంది.

ఇందులో యాక్షన్ సీక్వెన్స్ ను పూజా - వర్మ కలిసి డిజైన్ చేశారు. ర‌వి శంక‌ర్ - డీఎస్ఆర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. మాలహార్ భట్ జోషి సినిమాటోగ్రఫీ అందించారు. బ్రూస్ లీ నటించిన ‘ఎంటర్ ది డ్రాగన్’ సినిమా స్పూర్తితో రామ్ గోపాల్ వర్మ ''లడకీ'' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మరి ఈ సినిమా ఆర్జీవీ కి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.

హిందీ - చైనీస్ రూపొందిన 'లడకి' చిత్రాన్ని డిసెంబర్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తెలుగు తమిళంతో పాటుగా పలు భారతీయ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. చైనా లో ఈ సినిమా ‘డ్రాగన్ గర్ల్’ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని చైనా ఫిలిం గ్రూప్ కార్పొరేషన్ అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ అక్కడ 20 వేల థియేటర్స్ లో విడుదల చేయబోతోందని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.

బ్రూస్ లీ 81వ జయంతి సందర్భంగా దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా లో నవంబర్ 27న ‘లడకీ’ (డ్రాగన్ గర్ల్) పోస్టర్ ను విడుదల చేయబోతున్నారు. అలాగే చైనా లోని ఫోషన్ కుంగ్ ఫు ఫిలిం ఫెస్టివల్ లో బ్రూస్ లీ జయంతి సందర్భంగా ఇండో-చైనీస్ ప్రొడక్షన్ లో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రీమియర్ గా ప్రదర్శించనున్నారని తెలుస్తోంది.