Begin typing your search above and press return to search.
పబ్లిసిటీ తోపు ఏంటిలా పాతకాలపు పబ్లిసిటీ స్టంట్?
By: Tupaki Desk | 14 July 2022 8:30 AM GMTవివాదాస్పద అంశాలతో సినిమాలు చేస్తూ వివాదాలనే తన సినిమాలకు పబ్లిసిటీ స్టంట్ లుగా వాడుకుంటూ పబ్లిసిటీకే తోపు అనిపించుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఒక దశలో సెన్సేషనల్ మూవీస్ ని తెరకెక్కించి జీనియస్ అనిపించుకున్న వర్మ ఇప్పడు ఆ ఫామ్ ని కోల్పోయాడు. ఎంతలా అంటే ఒకప్పుడు ఆయన సినిమాల గురించి చర్చించుకున్న ఆడియన్స్ ఇప్పడు కనీసం పట్టించుకోలేనంత. ఎందుకంటే ఆయన తీస్తున్న సినిమాల్లో పెద్దగా విషయం వుండటం లేదు.
అలా విషయం లేకపోయినా ఇన్నాళ్లూ తన పబ్లిసిటీ స్టంట్ లతో మాయ చేస్తూ తన సినిమాలకు ఫ్రీ పబ్లిసిటీని ప్లాన్ చేస్తూ నెట్టింట వైరల్ అయ్యేలా చేశాడు. కానీ ఇప్పడు ఆయనలో ఆ స్కిల్ కూడా లేదా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒక దశలో పబ్లిసిటీ మాస్టర్ అనిపించుకున్న వర్మ ప్రస్తుతం ఆ స్కిల్ ని ప్రదర్శించలేకపోతున్నాడు. పాతకాలపు పబ్లిసిటీ స్టంట్ లతో తన సినిమాని వైరల్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.
కానీ అవి పెద్దగా వర్కవుట్ అయినట్టుగా కనిపించడం లేదు. వివరాల్లోకి వెళితే.. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా మూవీ 'లడ్ కీ' ఇదే మూవీని తెలుగులో 'అమ్మాయి' పేరుతో విడుదల చేస్తున్నాడు. ఇంగ్లీష్ లో 'ఎంటర్ ద గాళ్ డ్రాగన్' గా విడుదల కానుంది. కన్నడ నటి పూజా భలేకర్ ప్రధాన పాత్రలో నటించింది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ జూలై 15న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకని హైదరాబాద్ లో నిర్వహించారు.
ఈ సందర్భంగా వర్మ చేసి హంగమా పై నెట్టింట సెటైర్లు పేలుతున్నాయి. ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందిన సినిమా కావడంతో యాంకర్ శ్యామల వర్మని టకా టకా కొన్ని మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన సినిమాల గురించి చెప్పమంది. గతంలో శ్యామలని పొగడ్తల్లో ముంచెత్తిన వర్మ తాజాగా మాత్రం ఆమెపై సీరియస్ అయ్యాడు. తను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అసహనం వ్యక్తం చేశాడు.
'నేను చాలా సీరియస్ గా వున్నా.. ఇది చాలా సీరియస్ సినిమా' అంటూ అసహనాన్ని వ్యక్తం చేస్తే స్టేజ్ దిగిపోవడంతో అంతా అవాక్కయ్యారు. గతంలో ఓ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో శ్యామలని చూసిన వర్మ ఇంతందంగా వున్న మీరు నా కంటికి కనిపించకుండా ఎలా తప్పించుకున్నారు' అంటూ శ్యామలని ఐస్ చేయబోయారు. ఇప్పుడేమే ఇలా తనపై అసహనాన్ని వ్యక్తం చేస్తూ స్టేజ్ దిగి వెళ్లిపోవడంపై పలువురు నెటిజన్ లు కామెంట్ లు చేస్తున్నారు.
పబ్లిసిటీ తోపు ఏంటిలా పాతకాలపు పబ్లిసిటీ స్టంట్? అంటూ సెటైర్లు వేస్తున్నారు. వర్మ తన పాతకాలపు పబ్లిసిటీలో భాగంగానే యాంకర్ శ్యామలపై సీరియస్ అయ్యాడని, ఇది అతని పబ్లిసిటీ స్టంట్ లో ఒక భాగమని విమర్శలు గుప్పిస్తున్నారు.