Begin typing your search above and press return to search.

బాలయ్య కంటే వెయ్యి డాలర్లు ఎక్కువ

By:  Tupaki Desk   |   1 April 2019 8:23 AM GMT
బాలయ్య కంటే వెయ్యి డాలర్లు ఎక్కువ
X
లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఏ ఒక్కరూ తెలిసిన మొహం లేకపోయినా కేవలం కథలో ఉన్న కాంట్రోవర్షియల్ పాయింట్ తో హైప్ వచ్చేలా చేసుకున్న రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు దీని ఫలితం చూసి సంతోషంగానే ఉన్నాడు. ఆఫీసర్ లాంటి తీసికట్టు డిజాస్టర్ తర్వాత ఎలాంటి స్టార్లు లేకుండా వర్మ సినిమా మొదటి రోజు కోటి రూపాయలు దాటేసిందంటే చిన్న విషయం కాదు. అలా అని ఇది సూపర్ హిట్ బొమ్మ అనేందుకు కూడా లేదు. కేవలం బజ్ వల్ల ఈ మాత్రం వసూళ్లు దక్కాయి.

ఇదిలా ఉండగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ఓవర్సీస్ లో నమోదు చేసిన ఫిగర్సె ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఎన్టీఆర్ మీదే వచ్చిన మహానాయకుడు రెండు రోజులకు గాను $216458 వసూలు చేయగా లక్ష్మీస్ ఎన్టీఆర్ దానికి ఓ వెయ్యి డాలర్లు అదనంగా $218700 రాబట్టడం గమనార్హం. యాత్రను ఈ రెండు మధ్యలో ఉన్నప్పటికీ అది వైఎస్ఆర్ సినిమా కాబట్టి పోలిక పక్కన పెట్టినా బాలయ్య వర్మ సినిమాలలో కామన్ గా ఉన్న సెల్లింగ్ పాయింట్ ఎన్టీఆర్ కాబట్టి కంపారిజన్ తప్పు కాదు

మహానాయకుడు ఎంత డిజాస్టర్ అయినా అందులో ఉన్నది బాలకృష్ణ. వంద సినిమాల స్టార్ హీరో. క్రిష్ లాంటి బ్రాండ్ ఉన్న దర్శకుడు కీరవాణి లాంటి దిగ్గజ సంగీతం రైటర్ గా డిమాండ్ పీక్స్ లో ఉన్న సాయి మాధవ్ బుర్ర కలం ఇవేవి దాన్ని కాపాడలేకపోయాయి. సినిమా పోతే పోయింది కనీస స్థాయిలో రిటర్న్స్ రాలేదు. కాని లక్ష్మీస్ ఎన్టీఆర్ లో పైన చెప్పిన ఆకర్షణ ఒక్కటీ లేదు. అయినా కూడా మహానాయకుడిని క్రాస్ చేయడం అంటే వర్మ ఫ్యాన్స్ కు అంత కన్నా కావాల్సింది ఏముంది. వర్మ థాంక్స్ టు బాలయ్య అని చెప్పడం వ్యంగ్యంగా అనిపించినా చూస్తుంటే ఇదేదో ముందే ఊహించి చెప్పాడు కాబోలు అనిపిస్తోంది కదూ