Begin typing your search above and press return to search.

ఈ రెచ్చగొట్టడాలు ఏంటి వర్మా...?

By:  Tupaki Desk   |   25 July 2020 12:30 PM GMT
ఈ రెచ్చగొట్టడాలు ఏంటి వర్మా...?
X
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ట్వీట్స్ పెడుతుంటారనే విషయం అందరికి తెలిసిందే. సినిమాలతోనే కాకుండా తన వ్యాఖ్యలతో కూడా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంటారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దగ్గర నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాకా అందరిని ఏదొక విధంగా కామెంట్ చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలో వారి అభిమానుల ఆగ్రహానికి గురవుతాడు. అయినా సరే వర్మ తీరు మాత్రం మార్చుకోడు. ఇది ప్రజాస్వామ్య దేశం.. ప్రతి ఒక్కరికి ఏదైనా మాట్లాడే రైట్స్ ఉన్నాయి అని రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి మాట్లాడతారు. ఇక కాంట్రవర్సీ సినిమాలు తీస్తూ లీగల్ గా ప్రాబ్లమ్స్ రాకుండా ముందే జాగ్రత్త పడతాడు. ఈ స్టోరీ ఫిక్షనల్ అని చెప్తూ నిజజీవిత పాత్రలను పోలి ఉండే వారిని సెలెక్ట్ చేసి వేరే పేర్లతో సినిమా తీస్తుంటాడు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ''పవర్ స్టార్'' అనే సినిమా తీసేసాడు. ఈ రోజు ఆ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి బాగానే డబ్బులు సంపాదించుకున్నాడు.

అయితే ఈ సినిమా తెరకెక్కించే క్రమంలో ఎందరో ఎమోషన్స్ తో ఆడుకున్న వర్మ వారి విమర్శలను కూడా ప్రమోషన్స్ గా వాడుకున్నారు. 'నా ఆఫీస్ అడ్రెస్ అందరికి తెలుసు.. గూగుల్ మ్యాప్ లో కొట్టినా వస్తుంది.. ఎవరైనా రావాలంటే రావొచ్చు.. బస్తీ మే సవాల్' అంటూ రెచ్చగొడతాడు. దీనికి ఆవేశపడిన కొందరు అభిమానులు వర్మ ఆఫీస్ పై దాడి చేసారు. అయితే వర్మ మాత్రం క్రిందకి రాకుండా వారి కార్యాలయ సిబ్బందితో వారిని పోలీసులకి అప్పగించారు. అక్కడితో ఆగకుండా మళ్ళీ ట్వీట్ పెడుతూ నా ఆఫీస్ మీద దాడి చేసి నా పవర్ స్టార్ కి మరింత పబ్లిసిటీ చేసినందుకు థ్యాంక్స్ అని పేర్కొన్నారు. ఇలా అభిమానులను రెచ్చగొడుతూ తన సినిమాకి పబ్లిసిటీ చేసుకున్న వర్మ 'అర్జున్ రెడ్డి'లోని సన్నివేశాన్ని దాడి చేసిన వారితో కంపేర్ చేసి మీమ్ గా పోస్ట్ చేసారు. ఇలా ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకోవడం వర్మకి కొత్త కానప్పటికీ ఛాలెంజ్ చేయడం.. వాళ్ళొచ్చినప్పుడు దాక్కోవడం.. మళ్ళీ రెచ్చగొట్టడం ఏంటని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.