Begin typing your search above and press return to search.
కసకసా పొడిచిన కొడుకుపై తల్లిప్రేమ
By: Tupaki Desk | 8 April 2019 9:27 AM GMTసూటిగా మాట్లాడితే .. నిజాయితీగా ఉన్న మాట అనేస్తే వివాదాస్పదం అంటారు. అది ఎదుటివారి చేతకాని తనం అనేది వివాదాల రామ్ గోపాల్ వర్మ క్రిటిసిజం. అతడు తనకు తోచినదేదో చేసేస్తాడు. సూటిగా అనేస్తాడు. దాపరికం అంటే ఏంటో తెలీదు. అందుకే ఇన్ని వివాదాలు తననే చుట్టుముడుతున్నాయి. అవతలివారు తనను అర్థం చేసుకోవడాన్ని బట్టి తన ఉద్ధేశం కనెక్టవుతుందని చెబుతుంటారు. ఇటీవల ఆర్జీవీ వరుస వివాదాల గురించి తెలిసిందే. తాజాగా అతడు మరో పెను వివాదాన్ని తలకెత్తుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. నిన్నటిరోజున వర్మ బర్త్ డే కానుకగా `కోబ్రా` చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో ఆర్జీవీ నటుడిగా పరిచయం అవుతున్నాడు. ఈసారి కాస్తంత కొత్తగా తన మాతృమూర్తి సూర్యమ్మ సమక్షంలో ఆర్జీవీ బర్త్ డే కేక్ కట్ చేయడం ఆసక్తి రేకెత్తించింది. హైదరాబాద్ లో ప్రయివేటుగా ఈ పార్టీ జరిగింది.
ఈ బర్త్ డే ఈవెంట్ లో ఆర్జీవీ కస కసా పొడిచి కేక్ కట్ చేశారు. బర్త్ డేలు చేసుకోవడం అంటే ఇష్టం లేదని, ఒక సంవత్సరం చావుకు దగ్గరగా వెళ్లాననే బాధ కలుగుతుందని వర్మ అన్నారు. అయితే తన ఫాలోవర్స్ కోసం తనవాళ్ల కోసం ఇలా వెరైటీ బర్త్ డే ట్రీట్ ప్లాన్ చేశానని ఆర్జీవీ వివరణ ఇచ్చారు. ఇక కొడుకు పుట్టినరోజు వేళ తన మాతృమూర్తి సూర్యమ్మ ఎంతో ఆనందంగా సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. రామ్ గోపాల్ వర్మ తల్లి సూర్యమ్మ ఈ సందర్భంగా ఎంతో ఎమోషనల్ అయ్యారు. ``నేనెప్పుడూ మా రామూని ఒక వేషం వేయమని అడుగుతుంటాను. మంచి పరిణతి ఉన్న రోల్ చేయమని కోరుతుంటాను. `కంపెనీ` చిత్రంలో అజయ్ దేవగన్ లాంటి పాత్ర వేయాలని అడిగితే ఏం మాట్లాడేవాడు కాదు. చాలా సార్లు అడిగి అడిగి ఊరుకున్నాను`` అని పాత గుర్తుల్లోకి వెళ్లారు. అయితే `కోబ్రా` చిత్రాన్ని ప్రకటించినందుకు ఇలాంటి గిఫ్ట్ ఏ తల్లికి అంది ఉండదని .. తను నటిస్తున్నానని ప్రకటించి అద్భుతమైన గిఫ్ట్ ని ఇచ్చాడని సూర్యమ్మ ఆనందం వ్యక్తం చేశారు.
ఆర్జీవీ మాట్లాడుతూ .. బర్త్ డే అంటే నాకు చిరాకు. అది వచ్చినప్పుడల్లా సంవత్సరం ఓల్డ్ అయిపోతున్నాననే భయం.. ఒక సంవత్సరం చావుకు దగ్గర అవుతున్నామనే ఫీలింగ్ ఉందని అన్నారు. ప్రపంచంలో లక్షల కోట్ల మంది పుడతా ఉంటారు. క్రిములు.. జంతువులు పుడతాయి. మనం పుట్టిన తర్వాత ఏదైనా సాధిస్తే.. ఆ సాధించిన రోజు సెలబ్రేట్ చేసుకోవడంలో ఎక్కువ అర్థం ఉంది అని వర్మ తనదైన శైలిలో క్లాస్ తీస్కున్నారు.