Begin typing your search above and press return to search.
మిక్సెడ్ క్రిమినల్ నయీంపై థీమ్ సాంగ్
By: Tupaki Desk | 25 Sep 2016 10:30 PM GMTక్రిమినల్ నయీం చనిపోగానే.. ఇమ్మీడియట్ గా అందరికీ వచ్చిన థాట్.. రాంగోపాల్ వర్మకు ఇంకో సినిమా స్టోరీ దొరికేసిందనే. వంగవీటి తర్వాత తాను ఇంకో తెలుగు సినిమా చేయనని.. వంగవీటి కంటే గొప్ప స్టోరీ తనకు దొరకదనే అంటూ చాలానే చెప్పిన వర్మ.. ఇప్పుడు నయీం మూవీని మొదలుపెట్టేసి.. శరవేగంగా ఫినిష్ చేసేస్తున్నాడు కూడా.
ఆ మధ్య పవన్ కళ్యాణ్ పై వెటకారం కోసం ఓ సాంగ్ ను విడుదల చేసిన వర్మ.. ఇఫ్పుడు నయీం చిత్రంలోని థీమ్ సాంగ్ ను రిలీజ్ చేశాడు. 'మిక్సెడ్ క్రిమినల్ నయీం గురించి ఇదే నేను అర్ధం చేసుకున్నా. ఇది నయీం టైటిల్ సాంగ్ - సినిమా జనవరిలో విడుదల అవుతుంది' అంటూ ఓ ఆడియో సాంగ్ ను రిలీజ్ చేశాడు వర్మ. 'పిల్లలు చిన్నపుడు తప్పులు చేసినప్పుడు గారాబం చేస్తే.. ఆ తర్వాత వాళ్లు పెద్దవుతున్నపుడు సరిదిద్దకపోతే.. చివరకు క్రిమినల్స్ గా మారే ప్రమాదం ఉంటుంది' అంటూ మెసేజ్ ఇచ్చాడు వర్మ.
తప్పులు చేస్తున్నా.. బాధ్యతతో తల్లిదండ్రులు ముద్దుకొద్దీ గారాబం చేస్తే.. చివరకు క్రిమినల్స్ అయిపోతారు అని చెప్పాడు వర్మ. ఇక్కడ ఆ పిల్లాడు నయీం అయితే.. ఆ తల్లిదండ్రులే పోలీసులు.. పొలిటికల్ లీడర్సు.. ఇంకా చాలామంది బిజినెస్ మెన్. చిన్నపిల్లాడి మైండ్ లోకి క్రిమినల్ మైండ్ ఎక్కించారంటూ.. కాన్సెప్ట్ ని వాయిస్ రూపంలో తనే వివరించేశాడు వర్మ. 'వీడు క్రిమినల్ కాదు.. వీడు నక్సలైట్ కాదు.. వీడు గ్యాంగ్ స్టర్ కాదు.. అసలు వీడు మనిషే కాదు' అంటూ సాగే థీమ్ సాంగ్ బాగానే ఆకట్టుకుంది