Begin typing your search above and press return to search.
80ల నాటి హైదరాబాద్ దాదాలపై ఆర్జీవీ ఎటాక్!
By: Tupaki Desk | 19 Nov 2019 5:56 AM GMTరామ్ గోపాల్‌వర్మ ఎప్పుడు ఏ సంగతిని సడన్ గా తెరపైకి తెస్తాడో.. ఏ విషయాన్ని మీడియా ముందు ప్రకటిస్తాడో ఎవరికీ అర్థం కాదు. అంతా నా ఇష్టం.. నేనింతే టైపు. మీడియాకు ప్రకటించకుండానే సైలెంట్ గా సినిమాలు చేస్తూ షాకుల మీద షాకులిస్తున్న రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఏపీ కులరాజకీయాలమీద `కమ్మరాజ్యంలో కడపరెడ్లు` పేరుతో ఓ చిత్రాన్ని తెరపైకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా చేయాల్సినంత రచ్చ చేస్తోంది. తాజాగా వర్మ మరో చిత్రాన్ని ప్రకటించడం సంచలనంగా మారింది.
తను చేయబోయే చిత్రాల గురించి ఓడ్కా తాగినంత ఈజీగా సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా ప్రకటించే వర్మ తాజాగా అలాంటి ప్రకటనే చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. `జ్యోతిలక్ష్మి`... వంగవీటి చిత్రాల ఫేమ్ సాండీ అలియాస్ సందీప్ మాధవ్ హీరోగా నటించిన `జార్జిరెడ్డి` సినిమాని ఇటీవలే చూసిన వర్మ సాండీని అభినందిస్తూనే అతనితో కొత్త ప్రాజెక్ట్ ని చేయబోతున్నట్టు అనౌన్స్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
``విజయవాడ రౌడీయిజాన్ని చూపించాం. రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని చూపించాం. 80ల కాలం నాటి హైదరాబాద్ దాదాలపై ఓ సినిమా చేయబోతున్నాను. రియల్ లైఫ్ క్యారెక్టర్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకురాబోతున్నాను. దీనికి శివ స్ఫూర్తి`` అని వర్మ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దీంతో ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాతో వర్మ ఎలాంటి కాంట్రవర్సీలకు తెరలేపనున్నాడో చూడాలి. అన్నట్టు హైదరాబాద్ దాదా అంటే నయీమ్ గుర్తుకొస్తాడు. అతడి అరాచకాల్ని మించిన పరాకాష్ట ఇంకొకటి ఉండదు. దీనిపై ఆర్జీవీ సినిమా తీస్తానని తీయలేక తోక ముడిచాడు. మరి ఈసారి హైదరాబాద్ దాదాలు అంటే ఎవరిని టార్గెట్ చేస్తాడు అన్నది చూడాలి.