Begin typing your search above and press return to search.
రామ్ గోపాల్ వర్మ 'నగ్నం' రివ్యూ
By: Tupaki Desk | 28 Jun 2020 8:30 AM GMTకరోనా లాక్ డౌన్ లో అందరు దర్శక నిర్మాతలు ఇంటికే పరిమితమైతే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల శృంగార తార మియా మాల్కోవాతో తీసిన ‘క్లైమాక్స్’ అనే బూతు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన వర్మ ఇప్పుడు మరో బూతు షార్ట్ ఫిల్మ్ 'నగ్నం' ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చాడు. శ్రేయాస్ ఈటి యాప్ లోని ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో విడుదలైన ఈ సినిమా విశేషాలు తెలుసుకుందాం. రామ్ గోపాల్ వర్మ సినిమా అంటే స్టోరీ ఉండదు అని ప్రేక్షకులు ఒక అభిప్రాయానికి వచ్చి చాలా ఏళ్లయింది. ఈ క్రమంలో వచ్చిన 'నగ్నం' సినిమాలో కూడా స్టోరీ ఏమీ లేదు. కానీ 22 నిముషాలు ఉన్న ఈ బూతు సినిమాలో చూపించిన దాని ప్రకారం.. శ్రీ రాపాక (స్వీటి) ఇంట్లోని పనివాడి (జమల్) తో అక్రమ సంబంధం పెట్టుకొంటుంది. భార్య అక్రమ సంబంధం విషయం భర్త దీపక్ కంట పడుతుంది. శ్రీ చేసిన పనికి కోపోద్రిక్తుడైన దీపక్ భార్యపై దాడి చేస్తాడు. ఈ క్రమంలో జమాల్ తో జరిగిన గొడవలో చివరికి పనివాడు జమల్ కొట్టిన ఒక్క షాట్ కే దీపక్ మరణిస్తాడు.. ఫైనల్ గా శ్రీ రాపాక ఆ మర్డర్ ను పనివాడి మీద నెట్టేసి తప్పించుకుంటుంది. ఇదే 'నగ్నం' స్టోరీ. దీనికి స్టోరీ అని కాకుండా ఇంకేమైనా పేరు పెడితే బాగుంటుందేమో.
'నగ్నం' కథనం - విశ్లేషణ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. వర్మ 'నగ్నం' ట్రైలర్ లో ఏమి చూపించాడో సినిమాలో కూడా అంతకి మించి ఏమీ లేదు. దాంట్లో కూడా ఎలాంటి ట్విస్టులకు తావు లేకుండా ఓ బూతు సినిమా చూసాం అనే ఫీలింగ్ కలిగించేలా ఉంటుంది. బూతు తప్ప కథలో మరో కోణం కనిపించదు. 22 నిమిషాల సినిమాకి 200 రూపాయలు పెట్టిన వర్మ డబ్బులు దండుకోడానికే ఇలాంటి సినిమాలు తీసాడా అని అనిపించకమానదు. అయితే కొన్ని కెమెరా యాంగిల్స్ మాత్రం ఎలా పెట్టాడా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోక తప్పదు. కాకపోతే ప్రతీ షాట్ కేవలం బూతు చూపించడానికే పెట్టడంతో దానిపై కూడా చికాకు తెప్పించేలా చేసారు. అంతేకాకుండా ముందే బలం లేని స్క్రిప్ట్.. అందులో బలహీన సీన్స్ ను క్రియేట్ చేసి సినిమా మీద ఎలాంటి ఇంట్రస్ట్ కలగనీయకుండా చేసారు వర్మ.
'నగ్నం' లో నటించిన నటీనటుల గురించి చెప్పుకోడానికి ఏమీ లేదు. వారికి అసలు నటించడానికి స్కోప్ ఉంటేనే కదా నటించి చూపించడానికి. కాకపోతే లీడ్ క్యారెక్టర్ లో నటించిన స్వీటీ మాత్రం వర్మ చెప్పిన విధంగా ఏ మాత్రం మొహమాటం లేకుండా తన అందచందాలతో మెప్పించే ప్రయత్నం చేసింది. ఇక సాంకేతిక నిపుణుల విషయానికొస్తే ఈ సినిమాలో వారి అవసరం పెద్దగా లేదనే చెప్పాలి. ఒక్క సినిమాటోగ్రాఫర్ కి మాత్రం కొత్త కొత్త యాంగిల్స్ లో కెమెరా సెట్ చేయడానికి అవకాశం కలిగింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ ఒక శ్లోకంతో సరిపెట్టారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి చెప్పాలంటే ఈ సినిమాతో అటు ఇండస్ట్రీలో ఇటు సినీ అభిమానుల్లో మరింత దిగజారిపోయాడని చెప్పవచ్చు. ఒకప్పుడు టీవీల్లో అర్థరాత్రి వచ్చే ప్రోగ్రామ్స్ వర్మ తీసిన 'నగ్నం' సినిమా కంటే బెటర్ అనే ఫీలింగ్ కలిగించే రేంజ్ లో ఈ సినిమా తీసాడు. బూతు, కెమెరా యాంగిల్స్ పై పెట్టిన ఇంట్రెస్ట్ కథపై ఏమాత్రం పెట్టలేదని వర్మ మరోసారి నిరూపించుకున్నారు. అయితే ఇలాంటి సినిమాని ఇంకొంచెం లెన్త్ పెంచి సినిమాగా మార్చేసి థియేటర్ లో రిలీజ్ చేయనందుకు ఆడియన్స్ సంతోషించాలి అని చెప్పొచ్చు.
అయితే వర్మ ఈ సినిమాకు భారీ రేంజ్ లో ప్రమోషన్స్ చేయడంతో అలాంటి సినిమాలు చూడటానికి ఇష్టపడే వారు మాత్రం 'నగ్నం' కోసం క్యూ కట్టారు. గ్యాప్ లేకుండా స్వీటీ ఫొటోస్ ట్విట్టర్ లో వదలడమే కాకుండా మధ్యలో ఆమె తో ఇంటర్వూస్ కూడా వదిలి NNN కి బాగానే డబ్బులు దండుకున్నాడు. శ్రేయాస్ ఈటి యాప్ లోని ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో 'నగ్నం' ప్రసారమైన కొన్ని గంటల్లోనే 30 వేలమందికి పైగా ఈ చిత్రాన్ని చూసారు అని వర్మ చెప్తున్నాడు. అంతేకాకుండా ఈ సినిమా పైరసీ కాకుండా నిర్వాహకులు తీసుకున్న జాగ్రత్తలు మెచ్చుకోవాల్సిందే. పైరసీ అయినా ఈ సినిమా అందరూ దూరంగా ఉండమని సలహా ఇస్తారు అనుకోండి. అయినా కూడా ఈ మధ్య పెద్ద పెద్ద సినిమాలు ఓటీటీలో రిలీజైన కొన్ని నిమిషాలలోనే పైరేటెడ్ సైట్స్ లో దర్శనమిస్తున్నాయి. కానీ 'నగ్నం' మాత్రం పైరసీ చేయలేకపోయారు. ఫైనల్ గా 'నగ్నం' సినిమా ఒకవేళ పైరసీలో దొరికినా దానికి దూరంగా ఉండటం చాలా వరకు మంచిది. ఇక ఈ సినిమాకి రేటింగ్స్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు.