Begin typing your search above and press return to search.
జగన్‌పై కామెడీ ఎందుకు చేయనంటే.. ఆర్జీవీ
By: Tupaki Desk | 26 Nov 2021 2:30 PM GMTతమ కామెంట్లతో ఎప్పుడూ.. మీడియాలో ఉండే.. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఉరఫ్.. ఆర్జీవీ.. తాజాగా ఏపీ సీఎం జగన్ కామెంట్లు చేయను .. అంటూనే కామెంట్లు చేశారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఎపిసోడ్.. పై ఆయన స్పందించారు.
చంద్రబాబు తన భార్యను అవమానించారనిపేర్కొంటూ.. మీడియా ముందు.. అలా ఏడవడం.. సిల్లీగా అనిపించిందన్న.. ఆర్జీవీ.. చిన్నప్పుడు స్కూల్ సంగతులను గుర్తు చేసిందని ఎద్దేవా చేశారు. అదేసమయంలో ధైర్యం ఉన్న నాయకుడు ఎడవడని.. ఎన్నికష్టాలు వచ్చినా.. తట్టుకుని నిలబడతాడని పేర్కొన్నారు.
చంద్రబాబు కూడా.. తనపైన తన సతీమణిపైనా కామెంట్లుచేసిన వారిని అక్కడే కొట్టి ఉంటే బాగుండేద ని.. అన్నారు. లేదా.. నాలుగు గోడల వరకే ఆ ఘటనను పరిమితం చేసుకుని ఉంటే.. బాగుండేదన్నారు. ఈ సమయంలో ఏపీ సీఎం జగన్‌పై ఎందుకు కామెంట్లను చేయరని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. జగన్‌పై తాను కామెడీ చేయనని అన్నారు.
ఎన్నో బలమైన ఎదురు దెబ్బలు తినికూడా ఆయన ఎప్పుడూ.. సహనం కోల్పోలేదని.. ధైర్యంతో ఎదిరించారని పేర్కొన్నారు. అందుకే అందరిలోకీ తాను అభిమానించే నాయకుడు జగనేనని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా జగన్ గతంలో జైలు జీవితం అనుభవించినప్పుడు.. తాను ఆయా సంగతులను చాలా దగ్గరగా చూసినట్టు పేర్కొన్నారు. తండ్రి చనిపోయిన తర్వాత.. పార్టీలో ఒంటరిని చేశారని.. అయినప్పటి కీ.. ఆయన ఎక్కడా కుంగిపోకుండా.. ధైర్యంగా ముందుకు సాగారని వివరించారు.
టీడీపీ హయాంలోనూ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ఎప్పుడూ.. ముఖంలో ఆ దిగులు, విచారం కనిపించకుండా ముందుకు వెళ్లాడని.. ఈ దేశంలో అలా ఎవరూ ఉండలేదని.. ఆర్జీవీ కితాబిచ్చాడు. అందుకే తాను జగన్ గురించి కామెడీ కామెంట్లు చేయనని ఆర్జీవీ తేల్చి చెప్పారు.