Begin typing your search above and press return to search.

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిక్కుల్లో పడితే

By:  Tupaki Desk   |   19 Feb 2019 4:41 AM GMT
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిక్కుల్లో పడితే
X
ఇప్పుడంతా సాఫీగా ఉంది కాని రామ్ గోపాల్ వర్మకు అసలైన పరీక్ష ముందుంది. భీభత్సమైన సోషల్ మీడియా ప్రమోషన్ తో పాటు మహానాయకుడు బలహీనతలను తనకు అనుగుణంగా వాడేసుకుంటున్న వర్మ రిలీజ్ డేట్ విషయంలో మాత్రం నోరు విప్పడం లేదు. ఎంతసేపు హైప్ వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు తప్పించి అసలు సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాను అనేది మాత్రం ప్రస్తావనకు రాకుండా జాగ్రత్త పడుతున్నాడు.

మరోవైపు మహానాయకుడు బజ్ ఉన్నా లేకపోయినా శుక్రవారం రిలీజ్ కు రెడీ అయిపోయింది. కాని ఒక్క సందేహం మాత్రం అందరి మెదళ్లను తోలుస్తోంది. ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక వర్మ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తే తమ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రిని తప్పుగా చూపించారు కాబట్టి ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని టిడిపి కనక కోర్ట్ కు వెళ్తే కొంత చిక్కులు వచ్చే అవకాశం లేకపోలేదు.అప్పుడు బ్రేక్ పడే ఛాన్స్ ఉంది.

పైగా వర్మ ఇది చంద్రబాబుని ఉద్దేశించే తీసాను అని చాలా స్పష్టంగా వర్మ తన ప్రమోషనల్ వీడియోలలో ఫోటోలు సాక్ష్యాలతో సహా పెట్టేసాడు. అధికార పార్టీ వీటినే సాక్షాలుగా చూపిస్తుంది. అప్పుడు విడుదల విషయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ కు చిక్కులు తప్పవు. ఎన్నికల తర్వాత మాత్రమే క్లియరెన్స్ వస్తుంది. టిడిపి ఓడినా గెలిచినా ఇప్పుడు ఉన్నంత హైప్ లక్ష్మీస్ ఎన్టీఆర్ కు అప్పుడు ఉండదు. చల్లారిపోతుంది.

వర్మ ఇవన్ని అలోచించి ఉండడు అని కాదు కాని ఏదో తెరవెనుక ప్లాన్ అయితే ఉంది. మహానాయకుడు విడుదలైన రోజే లక్ష్మీస్ ఎన్టీఆర్ ని పోటీలో దింపుతాను అన్న వర్మ ఆ మాట మీద నిలవలేకపోయాడు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా చెప్పింది చేస్తాడని నమ్మలేం. పైన చెప్పినట్టు లక్ష్మీస్ ఎన్టీఆర్ కనక చిక్కుల్లో పడితే ఎన్నికలు పూర్తయ్యే దాకా బయటికి రావడం కష్టమే. సెన్సార్ జరిగేది హైదరాబాద్ లోనే అయినా కేసు పై కోర్టులో వేస్తే చేయడానికి ఏమి ఉండదు