Begin typing your search above and press return to search.
పాటతో ‘మర్డర్’ చేసిన వర్మ
By: Tupaki Desk | 4 Aug 2020 3:00 PM GMTవివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నుండి వస్తున్న మరో డిజిటల్ చిత్రం మర్డర్. మిర్యాలగూడెంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా వర్మ ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా చెప్పకున్నా అది అందరికి తెల్సిన విషయమే. మర్డర్ టైటిల్ తో రూపొందిన ఈ డిజిటల్ మూవీని త్వరలో విడుదల చేసేందుకు వర్మ సిద్దం అవుతున్నాడు. తన డిజిటల్ థియేటర్ లో వర్మ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రమోషన్ ను మొదలు పెట్టాడు.
ఇప్పటికే ట్రైలర్ ను విడుదల చేసి ఆలోచింపజేసిన వర్మ ఈసారి పాటను విడుదల చేశాడు. పిల్లలను ప్రేమించడం తప్పా అంటూ సాగే పాటను వర్మ స్వయంగా పాడాడు. గతంలో వర్మ పలు పాటలు పాడాడు. ఎప్పటిలాగే ఈ పాటను కూడా ‘మర్డర్’ చేశాడు. పిల్లల విషయంలో తల్లిదండ్రుల ఆలోచనను ఈ పాటలో చూపించాడు. పిల్లలకు పంటినొప్పి వస్తుందని చాక్లెట్ మాన్పిస్తే తప్పు కాదు కాని ప్రేమించవద్దని మంచిది కాదనడం తప్పా అంటూ వర్మ ప్రశ్నించడం ఆలోచించే విధంగా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
వర్మ ఈ చిత్రంలో మారుతీరావు మనో వేదనను చూపిస్తాడని ట్రైలర్ మరియు పాటను బట్టి అర్థం చేసుకోవచ్చు. అమృత ను కాస్త చెడుగానే చూపించడం జరుగుతుందేమో అనిపిస్తుంది. రామ్ గోపాల్ వర్మ త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్న నేపథ్యంలో అమృత రియాక్షన్ ఏంటా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పబ్లిసిటీ కోసం వర్మ విడుదల సమయంలో మరెంతగా రెచ్చి పోయి కామెంట్ చేస్తాడు అనేది చూడాలి.