Begin typing your search above and press return to search.

ప‌ప్పును ప‌దే ప‌దే ఏడిపిస్తున్న ఆర్జీవీ

By:  Tupaki Desk   |   9 Nov 2019 4:55 AM GMT
ప‌ప్పును ప‌దే ప‌దే ఏడిపిస్తున్న ఆర్జీవీ
X
'క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు' .. ఏపీ రాజ‌కీయాల‌పై ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వ‌ర్మ సెటైరిక‌ల్ మూవీ ఇది. కుల రాజ‌కీయాలు.. హ‌త్యా రాజ‌కీయాల్ని ఆయ‌న త‌న‌దైన శైలిలో ప్ర‌శ్నిస్తున్నారు ఈ చిత్రం లో. ఇప్ప‌టి కే తెలుగు దేశం అధినేత‌ల‌ పై ఆర్జీవీ ప‌దే ప‌దే సెటైర్లు వేస్తూ రిలీజ్ చేస్తున్న పోస్ట‌ర్లు టీజ‌ర్లు ప్రేక్షకుల లోకి జెట్ స్పీడ్ తో దూసుకెళుతున్నాయి. ముఖ్యంగా మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు.. ఆయ‌న త‌న‌యుడు లోకేష్ నాయుడుల‌ పై ఎప్ప‌టిప్పుడు ఆర్జీవీ సెటైరిక‌ల్ ఫోటోలు.. వీడియోలు ఏపీ లో హాట్ టాపిక్ గా మారాయి. ప‌ప్పు అంటూ ప‌దే ప‌దే చిన‌బాబును వెంబ‌డిస్తున్నాడు.

తాజాగా తాత(ఎన్టీఆర్) సైకిల్ లాక్కున్నావు.. న‌న్ను తొక్క‌మంటే ఆస‌క్తి లేదు!! ఫారిన్ వెళ్లిపోతా.. అంటూ లోకేష్ నాయుడు మ‌ద‌న‌ప‌డుతున్న ఓ సాంగ్ ని రిలీజ్ చేసేందుకు ఆర్జీవీ స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. అంత‌కుముందే ఈ పాట‌కు సంబంధించిన టీజ‌ర్ గ్లింప్స్ తో మ‌రోసారి వాడి వేడిగా చ‌ర్చ‌కు తెర లేపారు. తేదేపా అధినాయ‌కుడు చంద్ర‌బాబు.. యువ‌నాయ‌కుడు లోకేష్ పై సెటైరిక‌ల్ పేర‌డీ గీత‌మిది.

తాతగారి సైకిల్ నువ్వు లాక్కుని తొక్కతున్నాయి. నన్ను కూడా తొక్కమంటున్నావు. నాకు అంత సరదా లేదు గానీ నన్ను వదిలేయ్... నేను ఫారిన్ వెళ్లి పోతా.. నా జల్సా చేసుకుంటాను. పచ్చనైన మా డాడీ చెబుతున్నాను ముద్దాడి".. అంటూ సాగే టీజ‌ర్ ని రిలీజ్ చేశారు. పూర్తి పాట‌ను రిలీజ్ చేయ‌నున్నామ‌ని ప్ర‌క‌టించారు.

'చుక్కలాంటి అమ్మాయి..చక్కనైన అబ్బాయి' అనే పాట‌కు ఇది పేర‌డీ అని అర్థ‌మ‌వుతోంది. దీని ప్ర‌కారం .. ప‌ప్పు లాంటి అబ్బాయ‌.. చ‌క్క‌నైన అబ్బాయి! అంటూ లిరిక్ ని మార్చారా? అంటూ సోష‌ల్ మీడియాలో చ‌ర్చ మొద‌లైంది. అయితే ప్రారంభ లైన్ల‌ను టీజ‌ర్ లో దాచేశారు. పూర్తి పాట‌ను రిలీజ్ చేస్తేనే దీనిపై మ‌రింత క్లారిటీ వ‌స్తుంది. క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్టు చిత్రాన్ని త్వ‌ర‌లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న వ‌ర్మ .. ఆ తేదీ ఎప్పుడు? అన్న‌ది ఇంత‌వ‌ర‌కూ ప్ర‌క‌టించ‌ లేదు. మునుప‌టితో పోలిస్తే వివాదాల‌కు పెద్ద ఎత్తున ఆస్కారం ఉంది కాబ‌ట్టి రిలీజ్ తేదీని చెప్పేందుకు ఆర్జీవీ భ‌య‌ప‌డుతున్నార‌న్న గుస‌ గుస‌లు మీడియాలో వినిపిస్తున్నాయి. మ‌రి ఆర్జీవీ దీని పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.