Begin typing your search above and press return to search.
కేసుల పై గట్టిగా రిటార్ట్ ఇచ్చిన ఆర్జీవీ
By: Tupaki Desk | 24 Dec 2018 4:36 AM GMTకొంతమందిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే.. మనం ఒక మాటంటే వాళ్ళు రెండు మాటలంటారు.. ఒక బూతు విసిరితే వాళ్ళు మన పై డజను బూతులు విసురుతారు. వాళ్ళను కెలికినందుకు ఏకంగా పండగ చేసుకుంటారు. ఇలా కొరకరాని కొయ్యగా మారిన వ్యక్తులలో రామ్ గోపాల్ వర్మ ఒకరు. ఆయన ఇప్పుడు 'లక్ష్మిస్ ఎన్టీఆర్' అనే ఒక బృహత్కార్యాన్ని చేపట్టి 'ఆ విధంగా ముందుకు పోతున్నాడు'.
ఈ సినిమా నుండి 'వెన్నుపోటు' లిరికల్ సాంగ్ ను విడుదల చేయడం.. ఆ పాట టీడీపీ వర్గాలను కలవరపాటుకు గురిచేయడం.. వర్మ పై కేసులు పెట్టడం అందరికీ తెలిసిన విషయాలే. ఈ కేసుల పై ఆర్జీవీ తనదైన స్టైల్లో స్పందించాడు. ట్విట్టర్ ద్వారా ఒక పాత ఎన్టీఆర్ వీడియోను పోస్ట్ చేసి "నేను CBN గారిని డైరెక్ట్ గా ఒక్కమాట కూడా అనలేదు ... అలాంటిది నా మీదే కేసులు పెడితే డైరెక్ట్ గా దూషించిన ఈ క్రింది వీడియో లోని వ్యక్తి మీద ఎన్ని కేసులు పెట్టాలి ?" అంటూ సెటైరిక్ ట్వీట్ పెట్టాడు.
దీనికి సరైన సమాధానం ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే వీడియో లో చంద్రబాబుగారిని తిట్టేది ఎవరయ్యా అంటే టీడీపీ స్థాపకుడు.. చంద్రబాబు మామగారు అయిన ఎన్టీఆర్. ఇంకా వర్మను కెలికితే ఒకరకం వార్తలకే అలవాటుపడిన జనాలకు ఎన్టీఆర్ - బాబు ఎపిసోడ్ లో జరిగిన పాత పురాణాలను న్నిటినీ బయటకు తీసి జనాలకు చూపించి మరింతగా బాబుగారి పరువు తీసేలా ఉన్నాడు. మరి ఇప్పుడు బాబు సపోర్టర్స్ ఈ ఎపిసోడ్ లో ఎలా ముందుకు పోతారో వేచి చూడాలి.