Begin typing your search above and press return to search.
శిష్యుడి `పెద్ద దిక్కు` కోరికకు ఆర్జీవీ ఆన్సర్ ఇదీ
By: Tupaki Desk | 5 Jan 2022 1:37 PM GMTకొన్ని చిలిపి కోరికలు.. మరికొన్ని వింత ఆకాంక్షలు పుట్టుకొచ్చే సీజనిది. కాలం మహిమ అలా ఉంది. మొన్నటి వరకూ వైరస్ వేధిస్తే ఇప్పుడు రామూజీ వేధిస్తున్నారు. రామూజీ కాంపౌండ్ లేదా ఆర్జీవీ డెన్ లేదా ఇంకేదైనా కావొచ్చు.. అంతా నా ఇష్టం! అంటూ డెన్ లో వోడ్కా తాగినంత వీజీగా ఆర్జీవీని ఇండస్ట్రీ పెద్ద మనిషిగా చూడాలనుందని అనేశాడు ఓ పరమవీర శిష్యుడు అజయ్ భూపతి. ఓవైపు ఇండస్ట్రీ పెద్ద ఎవరు? అంటూ పెద్దలే కొట్టుకు చస్తుంటే.. ఈయనేమో తాపీగా ఆర్జీవీ ని సామీ నువ్వు రావాలి! ఇండస్ట్రీ పెద్ద కావాలి! అంటూ ఇన్ స్టా కామెంట్ కి యూత్ నుంచి బోలెడన్ని కామెంట్లు వచ్చి పడుతున్నాయి.
అయితే దీనికి ఆర్జీవీ సముఖంగా లేరు. ఆయన వెంటనే అజయ్ భూపతికి ఆన్సర్ కూడా ఇచ్చారు. అజయ్ గారూ .. ఇండస్ట్రీ వాళ్లకు పెద్ద దిక్కు ఉండాలనుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వాడికీ వేర్వేరు స్వార్థాలుంటాయి. దాని మూలానా వాడికి మాత్రమే పనికొచ్చే మాటే ప్రతివాడూ వింటాడు. ఎవడికో పెద్ద దిక్కు అని టైటిల్ ఇచ్చినంత మాత్రాన వాడి మాట ఎవ్వడూ వినడు!! అంటూ తనదైన స్టైల్లో ఆర్జీవీ కరుకుగా జవాబిచ్చారు. వాడు వీడు అంటూ ఆర్జీవీ సూటిగా సుత్తి లేకుండా వ్యక్తుల స్వార్థం గురించి మాట్లాడారు.
ఒకవేళ అదే జరిగితే..?
ఆర్జీవీ ఎప్పటికీ ఇండస్ట్రీ పెద్ద కారనేది దీనిని బట్టి అర్థమైంది. ఒకవేళ ఆర్జీవీ ఇండస్ట్రీ పెద్ద అయితే ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు అంతా ఊహించేస్తున్నారు. ఇన్నాళ్లు పచ్చగా ఉన్న ఇండస్ట్రీ అల్లకల్లోలం అవుతుందేమో! అంటూ పంచ్ లు వేస్తున్నారు. అయితే ఇండస్ట్రీకి అసలు పెద్ద అనేవాడు అవసరమే లేదు మొర్రో అంటూ రామూజీ మీడియా చానెళ్లకు ఎక్కి మరీ వాదిస్తున్నారు. చిరంజీవి మోహన్ బాబు లేదా ఇంకొకరు పెద్దగా ఉండడానికి ఆయన అంగీకరించడం లేదు. ఆయన చెప్పినట్టు చేస్తే.. అసలు ఏ సమస్యా ఉండదు కదా! అనేస్తున్నారు నెటిజనం కూడా.
అదేదో కేజీఎఫ్ బంగారు గనులకు ఒక మాఫియా పెద్ద కావాలి! అన్నట్టుగా.. లేదా `రక్షకుడు` సినిమాలో లాగా బడా పారిశ్రామిక వేత్త ఫ్యాక్టరీలను కాపాడేవాడొకడు కావాలి! అన్నట్టు అడిగేయడానికి ఇదేమైనా ఇండస్ట్రీ అనుకుంటున్నారా? కిరాణా కొట్టు అనుకుంటున్నారా? అంటూ కొందరు బుర్ర గోక్కుంటున్నారు!!