Begin typing your search above and press return to search.

'గీతాంజలి' సక్సస్ సీక్రెట్ రివీల్ చేసిన వర్మ..!

By:  Tupaki Desk   |   23 Oct 2022 7:30 AM GMT
గీతాంజలి సక్సస్ సీక్రెట్ రివీల్ చేసిన వర్మ..!
X
తెలుగులో మణిరత్నం చేసిన ఏకైక మూవీ 'గీతాంజలి'. ఈ ఒక్క సినిమాతోనే టాలీవుడ్ చరిత్రలో మణిరత్నం చిరస్థాయిగా నిలిచిపోయారు. టాలీవుడ్లో ఇప్పటి వరకు వచ్చిన ప్రేమకథలను తీసుకుంటుంటే 'గీతాంజలి' సినిమా ముందు వరుసలో ఉంటుంది. 1989లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్టుగా నిలిచింది.

నాగార్జున కెరీర్లో 'గీతాంజలి' ఒక మైలురాయిగా నిలిచింది. 'శివ' సినిమాతో మాస్ ఇమేజ్ తెచ్చుకున్న నాగార్జునను డైరెక్టర్ మణిశర్మ మరో యాంగిల్ లో చూపించాడు. దర్శకుడు రాంగోపాల్ వర్శ ఓ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'గీతాంజలి' వెనుక ఉన్న ఒక సీక్రెట్ ను రివీల్ చేశారు.

ఈ సినిమాలోని హీరో(నాగార్జున) క్యానర్ పేషంట్, హీరోయిన్ (గిరిజ) ఒక ప్రాణాంతక వ్యాధితో ఉన్నట్లు దర్శకుడు చూపించారు. వీరి మధ్య జరిగే లవ్ స్టోరీనే 'గీతాంజలి' కథ. ఈ సినిమా రిలీజుకు వారం ముందు డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాత ప్రీవ్యూ చూపించారని రాంగోపాల్ వర్మ చెప్పారు. ఈ సినిమాపై గుంటూరుకు చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్ పెదవి విరిచాడట.

హీరో క్యాన్సర్ పెషంట్ ఏంటీ? హీరోయిన్ కు జబ్బు ఉండటం ఏంటీ అని అభ్యంతరం తెలిపాడట. ఈ సినిమా విషయంలో డిస్ట్రిబ్యూటర్, నిర్మాతకు మధ్య ఫైనాన్స్ క్లియరెన్స్ కాలేదట. ఈ మూవీలో కొన్ని సీన్లను కట్ చేస్తేనే డబ్బు చెల్లిస్తానని సదరు డిస్ట్రిబ్యూటర్ నిర్మాతకు తేల్చి చెప్పాడట.

ఈ నేపథ్యంలో నిర్మాత ఈ మూవీలో డిస్ట్రిబ్యూర్ అభ్యంతరం చెప్పిన కొన్ని కీలక సన్నివేశాలను కట్ చేయించి ఫైనల్ కాపీని రెడీ చేయించి ఇచ్చారట. గుంటూరు వరకు 'గీతాంజలి' మూవీ అలాగే రిలీజు అయిందట. మరోవైపు ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని మొదటి వారం మంచి కలెక్షన్లు రాబట్టిందని వర్మ తెలిపాడు.

కీలక సన్నివేశాలు లేకుండా గుంటూరులో విడుదలైన 'గీతాంజలి' కూడా మంచి కలెక్షన్లు రాబట్టిందట. ఈ విషయం తెలుసుకున్న మణిరత్నం నిర్మాత నరసారెడ్డితో రెండో వారంలోనైనా ఆ సీన్లు అక్కడ కలుపమని అడిగారట. అయితే గుంటూరులో సినిమా బాగానే ఆడుతుంది? కదా మరోసారి డిస్ట్రిబ్యూటర్ ను కెలుకడం ఎందుకని నిర్మాత ఒప్పుకోలేదని వర్మ తెలిపారు.

ఈ వ్యవహారం చూస్తుంటే.. సినిమా ఫైనల్ కాపీ రెడీ అయినా ఇతరుల ఒత్తిడితో మార్పులు చేర్పులు తప్పవని అర్థమవుతోంది. నిర్మాతకు కావాల్సింది డబ్బులే గానీ.. సినిమా కథ, దర్శకుడి ఫీలింగ్స్ తో సంబంధం లేదని స్పష్టమవుతోంది. ఇలాంటివి సంఘటనలు ఇండస్ట్రీలో అనేకం ఉన్నాయని.. వీటిలో 'గీతాంజలి' కూడా ఒకటంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.