Begin typing your search above and press return to search.

భీమ్లా హిందీ రిలీజ్ పై ఆర్జీవీ సెటైర్

By:  Tupaki Desk   |   17 Feb 2022 6:00 AM IST
భీమ్లా హిందీ రిలీజ్ పై ఆర్జీవీ సెటైర్
X
జన‌సేనానిగా రాజ‌కీయాల్లోకి వెళ్లాక ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో ఆర్జీవీ ప‌రాచికాలు ప‌రాకాష్ట‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఆర్జీవీ వ‌ర్సెస్ పీకే ఎపిసోడ్స్ సంచ‌ల‌నంగా మారాయి. అప్ప‌ట్లో గొడ‌వ‌లు బాగా ముదిరి స‌ద్ధుమ‌ణిగిన సంగ‌తి తెలిసిందే.

ఆర్జీవీపై పీకే ఫ్యాన్స్ వీరంగం పీక్స్ కి చేరుకోగా ఒక‌రిపై ఒక‌రు సినిమాలు బ‌యోపిక్ లు అంటూ అల్ల‌రి చేయ‌డం హీటెక్కించింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ పై వ్యంగ్యంగా ఆర్జీవీ ఓ సినిమాని తీయ‌గా.. దానికి కౌంట‌ర్ గా పీకే ఫ్యాన్స్ వ‌ర్మ‌పైనా సెటైరిక‌ల్ మూవీని తీసి విడుద‌ల చేసారు. ఏదేమైనా ఇదంతా ఆ ఇద్ద‌రికీ ఆటవిడుపు. టైమ్ పాస్ గేమ్ లాంటిది.

అయితే ఈ గేమ్ ని ఇప్పుడు భీమ్లా నాయ‌క్ వైపు మ‌ళ్లించాడు ఆర్జీవీ. ఫిబ్ర‌వ‌రి 25న భీమ్లా నాయ‌క్ అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా విడుద‌ల‌వుతుండ‌గా.. ఈ మూవీపైనా సెటైర్ వేసాడు ఆర్జీవీ.

``భీమ్లా నాయక్ ని హిందీలో విడుదల చేస్తున్నందుకు గ్రేట్ ట్ ట్ ..ఇప్పుడు @ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న చిత్రం #పుష్ప కంటే పెద్దదని .. అతను అల్లు అర్జున్ కంటే పెద్ద హీరోన‌ని.. పాన్ ఇండియా లెవ‌ల్లో నిరూపించగలడు! అంటూ ఆర్జీవీ ఘాటుగానే వ్యాఖ్యానించారు.

దీనిపై నెటిజ‌నులు అంతే పంచీగా స్పందిస్తున్నారు. సంపు తన చిత్రాన్ని బాలీవుడ్ లో విడుదల చేస్తున్నారు. BN కంటే PK కంటే పెద్ద హీరో అంటూ వ్యాఖ్యానించాడో అభిమాని.

AA అభిమానులు .. Pk అభిమానుల బంధం ఎప్పటికీ ముగియలేదు.. అని ఒక ఫ్యాన్ స్పందించ‌గా.. POWER STORM తెరపైకి రావడానికి తేదీ సెట్ చేశారు! అంటూ మ‌రో అభిమాని ఉత్సాహం చూపించారు. ఓవ‌రాల్ గా ఆర్జీవీ - పీకే మ‌ధ్య‌లో ఫ్యాన్స్ సంద‌డితో భీమ్లా నాయ‌క్ కి బోలెడంత ప్ర‌చారం క‌లిసొస్తోంది.

ముఖ్యంగా ఆర్జీవీ సెటైరిక‌ల్ డైలాగ్ భీమ్లాకి హిందీ రిలీజ్ వ‌ల్ల ప్ర‌మోష‌న్స్ కి పెద్ద హెల్ప్ అనే భావించాలి. భీమ్లాకి ఎంత ఈగో ఉందో ఆర్జీవీకి అంత టెంప‌ర్ మెంట్ ఉంది. అందుకే ఆ ఇద్ద‌రి బంధం ఎప్ప‌టికీ వీడ‌నిది! అని అంతా అర్థం చేసుకోవాలి.