Begin typing your search above and press return to search.
ఫ్యాన్ అంటూనే 'భీమ్లా నాయక్' పై వర్మ సెటైర్లు
By: Tupaki Desk | 22 Feb 2022 5:39 AM GMTమెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి గతంలో వర్మ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. శ్రీ రెడ్డిని రంగంలోకి దింపి పవన్ ని బూతులు తిట్టించి తన పైశాచికత్వాన్ని బయటపెట్టిన వర్మ మళ్లీ మెగా హీరోలని టార్గెట్ చేయడం, అందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై విరుచుకుపడటం ఆసక్తికరంగా మారింది. ఇటీవల బన్నీని పొగిడేసస్తూ చిరంజీవి, పవన్ కల్యాణ్ లని వివాదంలోకి లాగడమే కాకుండా తను చేసిన పాత్రని మీరు చేయలేరని, చిరక ఫ్యామిలీ అని కాకుండా బన్నీ బంధువులు అంటేనే చిరు ఫ్యామిలీని గుర్తు పట్టేరోజులు వస్తాయని మెగా ఫ్యామిలీని వర్మ టార్గెట్ చేయడం సంచలనంగా మారింది.
తాజాగా మరోసారి `భీమ్లా నాయక్` సినిమాని, అందులో నటించిన పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేసిన వర్మ ఈ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేయాలని, `సర్దార్ గబ్బర్ సింగ్` హిందీలో రిలీజ్ చేయెద్దని చెప్పానని అయినా తన మాట వినకుండా విడుదల చేసి చేతులు కాల్చుకున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు వర్మ. `పుష్ప` సినిమా రిలీజ్ టైమ్ లో అల్లు వారికి, మెగా వారికి గొడవలు పెట్టాలని పెద్ద స్కెచ్చే వేసిన వర్మ తాజాగా `భీమ్లా నాయక్` ట్రైలర్ పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `భీమ్లా నాయక్`. సాగర్ కె. చంద్ర డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లోనూ భారీ హైప్ క్రియేట్ అయింది. మలయాళ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ని సోమవారం రాత్రి 9 గంటలకు మేకర్స్ రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా సంబరాలు చేసుకుంటుంటే వర్మ మాత్రం ఫ్యాన్ గా హర్ట్ అయ్యానంటూనే `భీమ్లా నాయక్` పై సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
పీకేకు వీరాభిమానిని అంటూ నే వ్యంగ్యంగా సెటైర్లు వేస్తూ మరోసారి పవన్ కల్యాణ్ ని, ఆయన ఫ్యాన్స్ ని వర్మ టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ట్రైలర్ లో పవన్ - రానా ఒకరిని మించి ఒకరు పోటా పోటీగా నటించినట్టుగా స్పష్టమైంది. అయితే వర్మ మాత్రం ట్రైలర్ చూసి ఫ్యాన్ గా హర్ట్ అయ్యానంటూ వరుస ట్వీట్ లు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ట్రైలర్ చూశాక `భీమ్లా నాయక్` అని కాకుండా ఈ చిత్రానికి `డానియల్ శేఖర్` అని పెట్టి వుంటే బాగుండేదన్నారు.
`ట్రైలర్ చూసిన తరువాత ఈ చిత్రానికి `భీమ్లా నాయక్` అని కాకుండా డానియర్ శేఖర్ అని పెట్టాల్సిందని అనిపించింది` అని తొలి ట్వీట్ చేశారు. ఆ తరువాత `ట్రైలర్ చూశాక మేకర్స్ పవన్ కల్యాణ్ ని అవమానిస్తూ రానా దగ్గుబాటిని ప్రమోట్ చేయడం కోసమే ఈ సినిమా చేసినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో పీకే ఫ్యాన్ గా నేను హర్ట్ అయ్యాను` అని మరో ట్వీట్ పెట్టారు. అన్ని యాంగిల్స్ లో చూసి పరిశీలించిన తరువాత నిజాయితీగా `భీమ్లా నాయక్` ట్రైలర్ గురించి చెప్పాలంటే ట్రైలర్ పవన్ కల్యాణ్ ది. సినిమా మాత్రం రానా దగ్గుబాటిదిలా వుందని మరో సెటైర్ వేశాడు వర్మ.
ఇక మరో ట్వీట్ లో `భీమ్లా నాయక్` ట్రైలర్ గురించి చెప్పాలంటే ... ఉత్తరాదిలో `బాహుబతి` కారణంగా పవన్ కల్యాణ్ కంటే రానా ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. అయితే ఉత్తరాది వారు పవన్ కల్యాణ్ ని విలన్ గా రానా ని హీరోగా భావించే ప్రమాదం వుంది. మేకర్స్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో, పవన్ కల్యాణ్ దీనికి ఎందుకు అనుమతి ఇచ్చాడో తెలియక షాక్ అయ్యాను` అంటూ ఫైనల్ ట్వీట్ పెట్టాడు వర్మ . ట్రైలర్ గురించి చెబుతూనే పవన్ ని ఇండైరెక్ట్ గా అవమానిస్తుండటంతో ఫ్యాన్స్ వర్మ పై గుర్రుగా వున్నారట.