Begin typing your search above and press return to search.

చంద్రబాబు ఏడుపుపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు..

By:  Tupaki Desk   |   23 Nov 2021 4:50 AM GMT
చంద్రబాబు ఏడుపుపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు..
X
సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా ప్రత్యేకతే. దేశంలో జరిగే ప్రతీ సంఘటనపై మొట్ట మొదటి సారిగా స్పందించే ఆర్జీవీ తనదైన శైలిలో కామెంట్స్ చేస్తుంటాడు. మీడియా ద్వారా కావచ్చు.. సోషల్ మీడియా ద్వారా కావచ్చు.. ఆర్జీవీ స్పందన మాత్రం ఉంటుంది. దీంతో ఏదైనా సంఘటన జరిగినప్పుడు మీడియా సంస్థలు కూడా ఆర్జీవి వాయిస్ కోసం ఎదురుచూస్తుంటారు. తాజాగా ఆయన మరో సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీ అసెంబ్లీలో జరిగిన సంఘటనపై కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా మంది సెలబ్రెటీలు బాబును పరామర్శిస్తూ పోస్టులు పెట్టారు. కానీ ఈ దర్శకుడు మాత్రం ‘యాక్టింగ్ సూపర్..హ్యపీ మెన్స్ డే’ అంటూ ట్విట్టర్ వేదికగా పోస్టులు పెట్టాడు. దీంతో ఆయన వ్యాఖ్యలపై దుమారం లేచినట్లయింది. ఈ సందర్బంగా ఆయన ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తను కామెంట్లు చేయడానికి గల కారణాలు వివరించారు.

‘సాధారణంగా ఆడవాళ్లు వెక్కి వెక్కి ఏడుస్తారు. కానీ ఒక 70 ఏళ్ల వ్యక్తి.. ఎన్నోసార్లు సీఎం అయిన పెద్ద మనిషి ఇలా చిన్న పిల్లాడిలా ఏడ్వడం చూసి షాక్ అయ్యాను. నేను సర్కార్ సినిమా చేసేటప్పుడు అమితాబ్ బచ్చన్ కొడుకును ఇంట్లో నుంచి బయటకు వెళ్లమనే సీన్ ఉంది. ఆ సీన్ లో కోపం చూపించాలి. కానీ సర్కార్ అలా కాదు హ్యూమన్ ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడే సర్కార్ అవుతాడు. ఇక్కడ కూడా ప్రతీ లీడర్ హ్యూమన్ ఎమోషన్స్ ను అర్థం చేసుకోవాలి. జార్జి బుష్ తన దేశంపై దాడి జరిగినప్పుడు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఏడ్వాలి కదా..?ఆ సమయంలో జార్జిబుష్ ఈ పని చేసిన వారికి త్వరలో సమాధానం చెబుతాం అని చెప్పాడు. ఆ సమయంలో అందరికీ ఒక ధైర్యం వస్తుంది. దీంతో తమవెంట లీడర్ ఉన్నాడనే హోప్ వస్తుంది. ’

‘అదీ కాకుండా పబ్లిక్ లో ఏడ్వడం వల్ల మీకున్న పవర్ వీక్ అయ్యే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు అంటే కోపం.. బూతులు తిట్టుకుంటారు. నా ఉద్దేశంలో చిన్న పిల్లలు ఏడుస్తారు..చంద్రబాబు పరిస్థితి చూస్తే పెన్సిల్ కోసం కొట్టుకొని ఇంటిదగ్గరికొచ్చి అమ్మ దగ్గర ఏడ్చినట్లు అనిపిస్తుంది. ఇక్కడ అమ్మ మీడియా. అసలు ఎమోషన్లోనే సగం డ్రామ ఉంటుంది. చిన్న పిల్లలు తల్లి ముందు ఏడుస్తూ ఉంటారు.. వారు బయటికి వెళ్లగానే ఆపేస్తారు..ఎందుకంటే ఎవరు చూడట్లేదు కాబట్టి. ప్రతీ ఏడుపులో ఓ డ్రామా ఉంటుందనే అనుకుంటా.కొంతమంది కోపం వచ్చి గోడను గట్టిగా కొడతారు.. అదే గోడమీద మేకులు పెట్టి బాదమని చెప్పండి.. అప్పుడు చేస్తారా..? అప్పుడు వారి కోపం వేరే విధంగా మారుతుంది. ’

‘మొన్న జరిగిన సంఘటనలో తప్పు ఎవరిది..? అని నేను చెప్పను. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించాలి. కానీ అసలు విషయం మాట్లాడకుండా పిల్లల క్లాస్ రూంలో దెబ్బలాడుకున్నట్లు నడిచింది. ఎవరెక్కవ బూతులు మాట్లాడితే వాళ్లు గొప్ప అని ఫీలవుతారు. అందుకే ఒకరి కంటే ఒకరు ఎక్కువ బూతులు మాట్లాడేసుకుంటున్నారు. వీళ్ల మీద వాళ్లు.. వాళ్లమీద వీళ్లు బూతులు తిట్టుకోవడం తప్ప ఎక్కడైనా అవసరముండే చర్చ చేస్తున్నారా..?’

‘ప్రతీ మనిషిలో ఎంతో కొంత ఎమోషన్ ఉంటుంది. ఒక్కోసారి ఒక్కో విధంగా మారుతూ ఉంటుంది. కానీ మరీ ఏడ్చేలా ఉంటుందని అనుకోను. ఎందుకంటే అసెంబ్లీలోకి చంద్రబాబు ఇక రాను అని శపథం చేసి వెళ్లాడు. ఆ తరువాత వెంటనే ఏడ్వడంలో వేరే అర్థం వస్తుంది. అంటే ఒక వ్యక్తి తన ఇన్నిరియర్ స్టెమినా తగ్గినప్పుడే ఇలా ఏడుపు వస్తుందని నా అభిప్రాయం’ అని రామ్ గోపాల్ వర్మ చెప్పారు.