Begin typing your search above and press return to search.
సినిమావాళ్లకు జెలసీ టన్నుల్లో ఉందా?
By: Tupaki Desk | 6 Jun 2020 2:30 PM GMTఏదో ఒక విషయంలో కామెంట్లు చేయడం.. తన సినిమాపై అందరి దృష్టిపడేలా ప్రచారం కల్పించుకోవడంలో రామ్ గోపాల్ వర్మను మించిన వారు మరొకరు లేరు. ఆర్జీవీ తన కొత్త సినిమా 'క్లైమాక్స్' ను ఆన్లైన్ లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఇండస్ట్రీ ఏకతాటిపైకి రావడం అనేది జరగని పని అని చెప్పిన వర్మ ఇక్కడ ఎవరి పని వారిదని చెప్పారు. పక్కనవాడి సినిమా ఫ్లాప్ అయితే ఇక్కడ మిగిలినవారందరికీ భలే ఆ.. నందంగా ఉంటుందని బాంబు పేల్చాడు. ఒకడంటే మరొకడికి పడదని కుండబద్దలు కొట్టాడు. ఇంతటితో ఆగకుండా ఈ టాపిక్ లోకి రాజమౌళిని తీసుకొచ్చి "రాజమౌళి RRR ఫ్లాప్ అయితే ఇండస్ట్రీ జనాలు రోడ్డు మీదకు అచ్చి బట్టలు విప్పి షాంపేన్ తో స్నానం చేస్తూ డ్యాన్స్ చేస్తారు" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒక మనిషి సక్సెస్ లో ఉన్నాడంటే ఇండస్ట్రీలో వ్యక్తులకు అంత జెలసీ ఉంటుందని.. రాజమౌళి మీద కూడా అంతే జెలసీ ఉందని.. RRR కనుక ఫ్లాప్ అయితే వాళ్లందరూ పండగ చేసుకుంటారని బాంబు పేల్చాడు. ఈ కామెంట్లతో ఒక్కసారిగా ఇప్పుడు ఆర్జీవీ హాట్ టాపిక్ అయ్యారు. 'క్లైమాక్స్' సంగతి దేవుడెరుగు.. ఈ జెలసీ ఇప్పుడు ట్రెండింగ్ అంశమై కూర్చుంది. నిజంగానే సినిమావాళ్లకు జెలసీ టన్నుల్లో ఉందా? ఇప్పటివరకూ ఎవరూ ఇంత ఓపెన్ గా చెప్పలేదు సుమీ!