Begin typing your search above and press return to search.

ఆర్యన్ ఖాన్ కు ‘న్యాయం’పై రాంగోపాల్ వర్మ సంచలన ప్రశ్నలు

By:  Tupaki Desk   |   21 Nov 2021 1:30 PM GMT
ఆర్యన్ ఖాన్ కు ‘న్యాయం’పై రాంగోపాల్ వర్మ సంచలన ప్రశ్నలు
X
ఆయనో సంచలన డైరెక్టర్.. యధార్థ ఘటనలను సినిమాలుగా చూపించే డిఫరెంట్ రైటర్.. ఆయన మాట్లాడినా వివాదమే.. సైలెన్స్ గా ఉన్న సంచలనమే.. ట్వీట్ చేస్తే వార్..కామెంట్ చేస్తే రచ్చ రచ్చ.. తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీలో ప్రత్యేకం. తెలుగు నుంచి హీందీ వరకు రామ్ గోపాల్ వర్మ సినిమాలో నటించిన వాళ్లు ఎక్కువే ఉన్నారు. అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్లు సైతం ఆర్జీవి సినిమాకు వద్దనకుండా నటించేస్తారు.

ఇక ఆర్జీవీ సినిమాలకే పరిమితం కాకుండా సామాజిక సంఘటనలపై స్పందిస్తారు. ముఖ్యంగా క్రైమ్ న్యూస్ అంటే ఈ డైరెక్టర్ కు బాగా ఇష్టం. అంతేస్థాయిలో పోలిటికల్ రంగంపై కూడా అప్పుడప్పుడు స్పందిస్తారు. తాజాగా ఆయన షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ అరెస్ట్ విడుదలపై స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

రాంగోపాల్ వర్మ తాజాగా ఆర్యన్ ఖాన్ పై రెండు ట్వీట్లు చేశారు. ‘ఆర్యన్ ఖాన్ ను అమాయకుడిని చేశాడు. తమ అధికారాలను దుర్వినియోగం చేసినందుకు దర్యాప్తు సంస్థలను జవాబుదారీగా చేయకపోతే అది ప్రజాస్వామ్యంపై ఒక జోక్ అవుతుంది. 'తక్కువ వ్యక్తులకు ఏమి జరుగుతుందో దేవునికి తెలుసా?’ అంటూ వర్మ ఎన్సీబీ ని టార్గెట్ చేసి ఎండగట్టారు.

ఆర్యన్ ఖాన్ కేసుపై కింద కోర్టు బెయిల్ నిరాకరించడం.. హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై రాంగోపాల్ వర్మ సెటైర్లు వేశారు. ఈ మేరకు న్యాయవ్యవస్థలతో ఈ తీరును ఎత్తి చూపారు. రెండు బెయిల్ పిటీషన్ల వాదనల పేపర్ కటింగ్ ను షేర్ చేసిన వర్మ ‘‘క్రింద ఇవ్వబడిన 2 వేర్వేరు కోర్టుల వీక్షణలతో పోల్చితే భయానక విషయం ఏమిటంటే ఎవరైనా న్యాయ వ్యవస్థను ఎలా విశ్వసిస్తారు అనే ప్రశ్న తలెత్తుతుంది?’ అంటూ వర్మ సంధించిన ప్రశ్నలు వైరల్ అవుతున్నాయి.